ప్రపంచంలో అత్యధిక మంది వినియోగిస్తున్న మెసేజ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తరువాత అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రీసెంట్‌గా వాట్సాప్ మనీ ట్రాన్స్‌ఫర్‌ను ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, త్వరలోనే మరో ఫీచర్ అందుబాటులోకి వస్తున్నట్టు ఎక్స్‌డీఏ టెక్నాలజీ తెలియజేసింది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో గ్రూప్స్ ఉన్నాయిగాని, గ్రూప్ చాటింగ్ పౌకర్యం లేదు. ఈ గ్రూప్ చాటింగ్ సౌకర్యాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నది. వాట్సాప్. ప్రస్తుతం ఈ వెర్సన్ టెస్టింగ్ దశలో…
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ పేరు మార్చుకోనున్నట్లు ప్రముఖ టెక్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోయినప్పటికీ, రానున్న వార్షిక సదస్సులో సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పేరు మార్చనున్నట్లు సమాచారం. ఇప్పటికే అమెరికా ప్రభుత్వంతో తలెత్తుతున్న సమస్యల వల్ల ఫేస్ బుక్ యూజర్ల సంఖ్య పడిపోతుందని భావించిన ఫేస్ బుక్ నిర్వాహకులు ఇలా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దిగ్గజ సమస్యలు అవసరాన్ని బట్టి మాతృ…
ప్రస్తుతం మనమంతా డిజిటల్ యుగంలో ఉన్నాం. మరుగుదొడ్డి లేని ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్ ఉందని గతంలో కొన్ని సర్వేలు వెల్లడించడం ఆశ్చర్యానికి గురిచేశాయి. అంటే మనిషి మొబైల్ ఫోన్లకు ఎంతలా అడిక్ట్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీ రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతుండటంతో అరచేతిలోనే ప్రపంచం ఇమిడిపోతుంది. కాళ్లు కదపకుండానే అన్ని నట్టింట్లోకి వచ్చిపడుతున్నాయి. గుండుసూది నుంచి లక్షలు ఖరీదు చేసే వస్తువుల దాకా ప్రతీఒక్కటి ఆన్ లైన్లో దొరుకుతున్నాయి. ఇలా ఆర్డర్ ఇచ్చామో లేదో అలా…
ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్.. ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో సోషల్ మీడియా యాప్స్ ఉండాల్సిందే.. చిన్న నుంచి పెద్ద అనే తేడా లేకుండా అంతా ఎక్కువ సమయం సోషల్ మీడియాపైనే గడుపుతున్నారంటే అతిశయోక్తి కాదు.. కానీ, సోమవారం సోషల్ మీడియాలో కీలక భూమిక పోషిస్తున్న ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ స్తంభించిపోయాయి.. తరచూ వాట్సప్ చెక్ చేసుకుంటూ.. ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటూ.. ఇన్‌స్టాలో పోస్టులు పెట్టేవారికి ఈ పరిణామం చాలా ఇబ్బంది కరంగా మారింది… మళ్లీ మళ్లీ ఆ యాప్స్…
సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు ఫేస్‌బుక్ డౌన్ అయింది. పలు సమస్యల కారణంగా ఫేస్ బుక్ ఓపెన్ కాలేదు. ఫేస్‌బుక్‌తో పాటుగా దాని అనుబంధ సంస్థలైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లు కూడా ఓపెన్ కాలేదు. దీంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఎందుకు ఇలా జరిగిందో తెలియన తికమకపడ్డారు. చాలామంది ట్విట్టర్‌లో పోస్టులు, మీమ్స్ పెట్టారు. అయితే, ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో తిరిగి రిస్టోర్ అయింది. …
కాసేపు సోషల్ మీడియా పనిచేయకపోతే ఎంత మంది ఎన్ని ఇబ్బందులు పడతారో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఏకంగా ఏడు గంటలపాటు సోషల్ మీడియా పనిచేయకుంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో చెప్పాల్సిన అవసరం ఉండదు. సోమవారం రాత్రి 9:30 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు సుమారు 7 గంటల పాటు సోషల్ మీడియా ఆగిపోయింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లు నిలిచిపోయాయి. పనిచేయలేదు. దీంతో ఏమైందో తెలియక కోట్లాది మంది భయపడ్డారు. అయితే, ఈరోజు…
వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. 20 నిమిషాలుగా పనిచేయని సేవలు.. ఫేస్‌బుక్ కు చెందిన సోషల్ మీడియా అప్లికేషన్స్ అయిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్లు ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఫీడ్ రీఫ్రెష్ కూడా కాకపోవడంతో యూజర్ల నుంచి అసహనం వ్యక్తమైంది. అయితే దీనిపై మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఒక్క సారిగా…
తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానాన్ని చురగొంది వాట్సాప్.. ఇప్పుడు ఏ స్మార్ట్ ఫోన్లోనైనా వాట్సాప్ ఉండాల్సిందేనన్న రేంజ్‌కి వెళ్లిపోయింది.. దాని వెనుక ఆ సంస్థ కృషి కూడా ఎంతో ఉంది.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో.. తమ యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది వాట్సాప్.. ఇప్పుడు తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ఎలా ఉపయోగించుకోవాలో చెబుతోంది. వాట్సప్‌లో చాటింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అవకాశం ఉన్నా.. ఇప్పటికీ ఎక్కువ మంది మెసేజ్‌లు పంపించుకోవడానికే ఉపయోగిస్తారు. మెసేజ్ పంపించాలంటే..…
ఇప్పుడు అంతా సోషల్ మీడియా కాలం.. చాలా విషయాలు సోషల్ మీడియాకు ఎక్కి హల్ చల్ చేస్తుంటాయి.. ఇక, లైక్‌లు, కామెంట్లు, షేరింగ్‌లు.. ఇలా అది తప్పా..? ఒప్పా..? అనే విషయంతో సంబంధం లేకుండా అలా వైరల్ చేసేవాళ్లు లేకపోలేదు.. అయితే.. ఎన్నికలు, ఓట్ల లెక్కింపు జరుగుతోన్న సమయంలో.. ఎలాంటి సమస్యలు సృష్టించకుండా సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది ఈస్ట్ ఆఫ్రికా దేశమైన జాంబియా.. ఈ నెల 12వ తేదీన జాంబియాలో దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి.…
మనదగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు… అందులో తప్పని సరిగా వాట్సప్ ఉండి తీరుతుంది. వాట్సప్‌కు కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు. అయితే, ఈ వాట్సప్ ఎంత వరకు సురక్షితం. యూజర్ల డేటాకు ఎంత వరకు భరోసా ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ సురక్షితం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఈ వాట్సప్ విదేశీసంస్థకు చెందినది కావడంతో ఆందోళన మరింత ఎక్కువైంది. వాట్సప్‌కు పోటీగా ఎన్ని షార్ట్ మెసేజ్ యాప్‌లు వచ్చినా ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా భారత…