క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!
- భారత మార్కెట్లో Yezdi Roadster Red Wolf Edition ను విడుదల
- గ్లోసీ రెడ్ కలర్ స్కీమ్, క్రోమ్ ఫినిషింగ్‌తో ప్రీమియం, రగ్గుడ్ లుక్.
- 334cc Alpha2 లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 29 hp పవర్, 29.8 Nm టార్క్ ఉత్పత్తి.
- 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ సదుపాయం.
- ముందు 320 mm, వెనుక 240 mm డిస్క్ బ్రేక్స్, డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్ భద్రత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yezdi Roadster Red Wolf Edition: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ “క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends)” తన ఐకానిక్ రోడ్‌స్టర్ శ్రేణిలో కొత్త స్పెషల్ ఎడిషన్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. Yezdi Roadster Red Wolf Edition పేరుతో వచ్చిన ఈ మోడల్ 1970 కాలం నాటి యెజ్డీ బైక్‌ల వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఆధునిక సాంకేతికతతో మిళితమై తయారు చేశారు. క్లాసిక్ డిజైన్‌ను ఇష్టపడే యువత, రేట్రో బైక్ ప్రియులను లక్ష్యంగా చేసుకుని ఈ ఎడిషన్‌ను విడుదల చేశారు.
PV Sindhu: పివి సింధు సేఫ్.. క్షేమంగా భారత్ కు రాక..!
Also Read
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
Red Wolf Edition ప్రధానంగా కాస్మెటిక్ అప్‌డేట్స్‌తో ప్రత్యేకతను కలిగి ఉంది. గ్లోసీ రెడ్ కలర్ స్కీమ్ బైక్‌కు రగ్గుడ్ లుక్ ను ఇస్తుంది. ఎగ్జాస్ట్, ఇంజిన్, హ్యాండిల్ బార్‌లపై క్రోమ్ ఫినిషింగ్ ఉండటంతో ప్రీమియం ఫీలింగ్ కలుగుతుంది. రిచ్ బ్రౌన్ కలర్ సీటు ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణ. మాడ్యులర్ సెటప్ వల్ల సోలో లేదా పిలియన్ సీటుగా మార్చుకునే సౌకర్యం ఉంది. మెకానికల్ పరంగా చూస్తే.. ఈ స్పెషల్ ఎడిషన్‌లో స్టాండర్డ్ రోడ్‌స్టర్ ఇంజిన్ ను కొనసాగించారు. ఇందులో334cc Alpha2 లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 29 hp పవర్, 29.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ సదుపాయం ఉండటంతో గేర్ సులువుగా చేయవచ్చు.
IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!
ఇక బ్రేకింగ్ వ్యవస్థలో ముందు భాగంలో 320 mm డిస్క్, వెనుక భాగంలో 240 mm డిస్క్ బ్రేక్స్ అమర్చారు. డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్ వల్ల అత్యవసర పరిస్థితుల్లో కూడా బెస్ట్ నియంత్రణ లభిస్తుంది. 12.5 లీటర్ల ఇంధన ట్యాంక్ తో ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 350 కి.మీ.కు పైగా ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు రైడింగ్‌ను సౌకర్యవంతంగా చేస్తాయి. బైకు ధర రూ. 2.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
తాజావార్తలు
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!