ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్.. ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో సోషల్ మీడియా యాప్స్ ఉండాల్సిందే.. చిన్న నుంచి పెద్ద అనే తేడా లేకుండా అంతా ఎక్కువ సమయం సోషల్ మీడియాపైనే గడుపుతున్నారంటే అతిశయోక్తి కాదు.. కానీ, సోమవారం సోషల్ మీడియాలో కీలక భూమిక పోషిస్తున్న ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ స్తంభించిపోయాయి.. తరచూ వాట్సప్ చెక్ చేసుకుంటూ.. ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటూ.. ఇన్‌స్టాలో పోస్టులు పెట్టేవారికి ఈ పరిణామం చాలా ఇబ్బంది కరంగా మారింది… మళ్లీ మళ్లీ ఆ యాప్స్ ఓపెన్ చూసి చూస్తే.. తమ ఫోన్‌లోనే ఏదైనా సమస్య ఉందా అని చెక్‌చేసుకున్నవారు కూడా లేకపోలేదట… మరోవైపు.. దాని ఎఫెక్ట్ ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పై భారీగానే పడింది… ఆ పరిణామంతో కొన్ని గంటల వ్యవధిలోనే ఏకంగా 7 బిలియన్ డాలర్లు అంటే ఇండిన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.52 వేల కోట్ల విలువైన ఆస్తులు తరగిపోయాయి. దీంతో ప్రపంచకుభేరుల జాబితాలో మూడు నుంచి ఐదో స్థానానికి పడిపోయాడు జూకర్ బర్గ్..
కాగా, ప్రస్తుతం మార్క్ జుకర్‌బర్గ్ సంపద 122 బిలియన్ డాలర్లుగా ఉంది.. ఫేస్‌బుక్ స్తంభించిందనే వార్తలు గుప్పుమనడంతో.. ఆ సంస్థ షేర్లు 5 శాతం మేర పడిపోయాయి. దీంతో గతనెల మధ్య నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్ల విలువలో 15 శాతం తగ్గుదల నమోదైంది. మొత్తంగా సోషల్ మీడియా డౌన్.. జూకర్‌బర్గ్‌కు గట్టిగానే దెబ్బకొట్టింది..