వివాదాస్పదమైన ప్రైవసీ పాలసీని వాట్సాప్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్, భారత రాజ్యాంగం ప్రకారం వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో దీనిని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే వినియోగదారులు ఈ పాలసీని అంగీకరించాలని ఒత్తిడి చేయబోమని తెలిపింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు వచ్చేవరకు తాము దీన్ని అమలు చేయమని.. హైకోర్టుకు తెలిపింది. ఒకవేళ బిల్లు దీన్ని అనుమతిస్తే.. అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తామని వాట్సాప్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. వాట్సాప్ కొత్త…
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. వాట్సాప్ వాడుతోందని చెల్లిని నరికి చంపేశాడు అన్న. తూత్తుకుడి జిల్లా వాసవం పురం నగర్ లో ఈ ఘటన జరిగింది. అన్ లైన్ చదువుల కోసం 12 తరగతి చదువుతున్న కవితకు సెల్ ఫోన్ కోనిచ్చాడు అన్న మలైరాజా. అయితే సెల్ ఫోన్ వచ్చాక చదువు కంటే ఎక్కవసేపు వాట్సాప్ ,వీడియోలు చూస్తూ సమయం గడుపుతుంది కవిత. అయితే తన పద్ధతి మార్చకోవాలని చెల్లిని పలుమార్లు హెచ్చరించాడు అన్న మలైరాజా. ఎన్ని…
తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చిన తర్వాత.. వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో చాలా తొందరగా ప్రాసెస్ అయిపోతోంది.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పాస్‌బుక్ కూడా చేతిలో పెట్టేస్తున్నారు అధికారులు.. అయితే, ధరణిలో కొన్ని సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.. ఇక, వాటి పరిష్కారానికి రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి.. దీంతో.. ఆ సమస్యలు త్వరితగతిని పరిష్కరించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది ప్రభుత్వం.. ధరణి కి సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు సమర్పించేందుకు తాజాగా.. వాట్సాప్, ఈ మెయిల్‌ను…
సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ పై నియంత్రణకోసం కొత్త నిబందనలను కేంద్రప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నిబందనలు ఈరోజు నుంచి అమలులోకి వచ్చాయి. కేంద్రప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన కొత్త ఐటి నిబందనలు యూజర్ల గోప్యతకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, వెంటనే కేంద్రం తీసుకొచ్చిన నిబందలను అడ్డుకోవాలని కోరుతూ వాట్సాప్ డిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దేశ భద్రతకు లేదా ప్రజలకు హాని కలిగించే విధంగా ఏవైనా పోస్టులను పెడితే ఆ వివరాలను ప్రభుత్వానికి తెలియజేసేలా కొత్త నిబందనలు…
ఒకరు కత్తిని సర్జరీకి వాడితే… మరొకడు మర్డర్ చేయటానికి ఉపయోగించవచ్చు! టెక్నాలజీ కూడా అంతే! వాట్సప్ ని అందరూ మెసెజెస్ పంపటానికి వాడితే కొందరు మాత్రం సినిమాల పైరసీకి వాడేస్తున్నారు. వాట్సప్ తో పాటూ టెలిగ్రామ్ లాంటి యాప్స్ ని కూడా పైరసీగాళ్లు తెగ యూజ్ చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు సల్మాన్ ఖాన్ కు తలనొప్పిగా మారింది. మే 13న ఈద్ సందర్భంగా ఆయన నటించిన ‘రాధే’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఆన్ లైన్…
వాట్సాప్ అమలులోకి తెచ్చిన కొత్త ప్రైవసీ పాలసీకి కేంద్ర ప్రభుత్వం నో చెప్పిన సంగతి తెలిసిందే.. కొత్త ప్రైవసీ పాలసీలను ఉపసంహరించుకోవాలని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.. ఈ మేరకు ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాట్సాప్‌కు లేఖను రాసింది.. అయితే, కేంద్రం లేఖపై వాట్సాప్ స్పందించింది.. వినియోగదారుల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వాట్సాప్ పేర్కొంది.. ఒక ప్రకటనను విడుదల చేసిన వాట్సాప్.. భారత ప్రభుత్వం పంపిన లేఖపై స్పందించామని, యూజర్ల…