కాసేపు సోషల్ మీడియా పనిచేయకపోతే ఎంత మంది ఎన్ని ఇబ్బందులు పడతారో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఏకంగా ఏడు గంటలపాటు సోషల్ మీడియా పనిచేయకుంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో చెప్పాల్సిన అవసరం ఉండదు. సోమవారం రాత్రి 9:30 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు సుమారు 7 గంటల పాటు సోషల్ మీడియా ఆగిపోయింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లు నిలిచిపోయాయి. పనిచేయలేదు. దీంతో ఏమైందో తెలియక కోట్లాది మంది భయపడ్డారు. అయితే, ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో తిరిగి పునరుద్దరించబడ్డాయి. సాంకేతిక లోపం కారణంగా స్థంబించినట్టు వాట్సప్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అప్డేట్ చేస్తున్నామని ప్రకటించింది. ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లు పనిచేయకపోవడంతో మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్ పై ఒత్తిడి పెరిగింది.
Read: అక్టోబర్ 5, మంగళవారం దినఫలాలు