వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆప్షన్స్‌ను తీసుకొస్తూ వినియోగదారుల సంఖ్యను మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే పేమెంట్ గేట్‌వే ను తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్‌ను వినియోగించుకునే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా వెబ్ యాప్ ద్వానా ఒక సిస్టమ్‌కు కనెక్ట్ అయినపును, మొబైల్‌లో ఇంటర్నెట్ లేకుంటే వెబ్ యాప్ కూడా ఆగిపోతుంది. కానీ, తాజా అప్డేట్ ప్రకారం మొబైల్‌లో ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్‌ను వెబ్ యాప్ ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఒకేసారి మొబైల్ నుంచి నాలుగు డివైజేస్‌కు కనెక్ట్ అయ్యేవిధంగా ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్.
Read: లోకల్ రైళ్లపై రెయిన్ ఎఫెక్ట్…
ఇప్పటికే బీటా వెర్సన్‌ను రిలీజ్ చేసిన వాట్సాప్ ఇప్పుడు వినియోగదారులకు పూర్తి వెర్సన్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ ఓపెన్ చేసిన తరువాత వెబ్ వాట్సాప్ కు కనెక్ట్ అయ్యేందుకు లింక్ ఒపెన్ చేసి కనెక్ట్ అదర్ డివైజెస్ పై క్లిక్ చేయాలి. ఇలా నాలుగు డివైజెస్‌లలో ఒకేసారి కనెక్ట్ చేసుకొవచ్చు. మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ లేకున్నా అదర్ డివైజెస్‌లో వాట్సాప్‌ను వినియోగించుకొవచ్చు. అయితే, మొబైల్‌లో 14 రోజుల వరకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకపోతే ఆటోమాటిక్‌గా వెబ్ వాట్సాప్ లు లాగౌట్ అవుతాయి.