ఇలా చేయండి.. వాట్సప్‌లో ఇక టైప్ చేయాల్సిన అవసరమే లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానాన్ని చురగొంది వాట్సాప్.. ఇప్పుడు ఏ స్మార్ట్ ఫోన్‌లోనైనా వాట్సాప్ ఉండాల్సిందేనన్న రేంజ్‌కి వెళ్లిపోయింది.. దాని వెనుక ఆ సంస్థ కృషి కూడా ఎంతో ఉంది.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో.. తమ యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది వాట్సాప్.. ఇప్పుడు తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ఎలా ఉపయోగించుకోవాలో చెబుతోంది. వాట్సప్‌లో చాటింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అవకాశం ఉన్నా.. ఇప్పటికీ ఎక్కువ మంది మెసేజ్‌లు పంపించుకోవడానికే ఉపయోగిస్తారు. మెసేజ్ పంపించాలంటే.. కీప్యాడ్ ద్వారా టైప్ చేసి పంపించాల్సి ఉంటుంది.. కొన్ని సమయాల్లో ఇది కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్త ఫీచర్ తీసుకొస్తుంది.. ఇక నుంచి వాట్సప్‌లో మెసేజ్ టైప్ చేయాల్సిన అవసరం ఉండదు.. కానీ మెసేజ్ పెట్టొచ్చు.
కొత్త ఫీచర్‌ను పొందేందుకు కొన్ని సెట్టింగ్స్ మార్చితే సరిపోతోంది.. ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. చాలామందికి తెలియదంటున్నారు.. వాట్సప్ చాట్ బాక్స్‌లో వాయిస్ పంపించే ఆప్షన్ ఇప్పటికే ఉన్నా… అది కేవలం వాయిస్ మెసేజ్‌లనే పంపించేందుకు వీలు అవుతుంది.. ఆ వాయిస్ కాస్తా మెసేజ్‌గా మారాలంటే.. ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలి.. గూగుల్ అసిస్టెంట్ సాయం తీసుకోవాల్సి ఉంటుంది.. అంతే కాదు.. ఇది ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తోంది. గూగుల్ అసిస్టెంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. ప్రొఫైల్ ఫోటో రైట్ కార్నర్ మీద క్లిక్ చేయాలి.. కిందికి స్క్రోల్ చేసి.. గూగుల్ అసిస్టెంట్ ఫంక్షన్‌ను ఆన్ చేసుకోవాలి.. ఆ తర్వాత హేయ్ గూగుల్ లేదా ఓకే గూగుల్ అని పిలిస్తే.. అప్పుడు వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు.. ఫలానా వ్యక్తికి వాట్సప్ మెసేజ్ పంపించు అని చెప్పాలి. ఆ వ్యక్తి వాట్సప్ చాట్‌ను గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేస్తుంది. ఆ తర్వాత.. ఆ వ్యక్తికి ఏం మెసేజ్ పంపించాలో.. వాయిస్ అసిస్టెంట్‌కు చెప్పాల్సి ఉంటుందన్నమాట. వాయిస్‌గా చెబితే.. ఆ వ్యక్తిని టెక్స్ట్ రూపంలోగూగుల్ అసిస్టెంట్ పంపిస్తుంది. టైప్ చేసే అవకాశం లేని సమయంలో ఇది వాట్సప్ యూజర్లకు ఎంతో ఉపయోగపడనుంది.
Also Read
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!