Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best Selling Cars: భారత ఆటోమొబైల్ మార్కెట్ ఫిబ్రవరి 2026లో భారీగా అభివృద్ధిని నమోదు చేసింది. వినియోగదారులు ఎక్కువగా SUVల వైపు చూస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అదే సమయంలో విశ్వసనీయత, మైలేజ్, భద్రతా ఫీచర్లను ప్రాధాన్యంగా తీసుకుని కొనుగోలు నిర్ణయాలు తీసుకున్నట్లు సేల్స్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అమ్మకాలలో ఎప్పటిలాగే మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుండాయ్ వంటి ప్రధాన కంపెనీలు ముందంజలో ఉన్నాయి.
క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!
Also Read
- Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
- 100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
ఫిబ్రవరి నెల టాప్ 10 జాబితాలో మారుతి సుజుకి మోడళ్లు టాప్ ప్లేస్ లో నిలిచాయి. ఇందులో మారుతి సుజుకి వాగన్ R (Maruti Suzuki Wagon R) అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మధ్యతరగతి కుటుంబాల కోసం సరసమైన ధర, మెరుగైన మైలేజ్ ఈ కారును ముందంజలో నిలిపాయి. అలాగే మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift), మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) అమ్మకాలలో జోరు కొనసాగిస్తూ టాప్ 5లో స్థానం సంపాదించాయి. ఇక కాంపాక్ట్ SUV విభాగంలో మారుతి సుజుకి బ్రిజా (Maruti Suzuki Brezza) మంచి డిమాండ్‌ను నమోదు చేసింది. కుటుంబ అవసరాలకు అనుగుణంగా మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) కూడా మంచి స్పందన పొందింది. వీటితోపాటు మారుతి సుజుకి ఫ్రొన్క్స్ (Maruti Suzuki Fronx) కూడా టాప్ 10లో చోటు దక్కించుకుంది.

మరోవైపు టాటా మోటార్స్ తన భద్రతా ప్రమాణాలు, డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో టాటా పంచ్ మైక్రో SUV సెగ్మెంట్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే టాటా నెక్సన్ కూడా ఫ్యామిలీ SUVగా మంచి అమ్మకాలు నమోదు చేసింది. వీటితోపాటు హ్యుండాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా కార్లు కూడా అమ్మకాల రికార్డును కొనసాగించాయి. మిడ్-సైజ్ SUV విభాగంలో “హ్యుండాయ్ క్రెటా” అమ్మకాల రికార్డును కొనసాగించింది. సాంకేతిక ఫీచర్లు, కంఫర్ట్, డిజైన్ ఈ కారును వినియోగదారుల బెస్ట్ ఎంపికగా నిలిపాయి. ఇక SUVల విభాగంలో మహీంద్రా స్కార్పియో-N కూడా టాప్ 10 జాబితాలో స్థానం సంపాదించింది.
PV Sindhu: పివి సింధు సేఫ్.. క్షేమంగా భారత్ కు రాక..!
అమ్మకాల్లో ఫిబ్రవరి 2026 టాప్ 10 కార్లు:
* మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Maruti Suzuki Wagon R)
* టాటా పంచ్ (Tata Punch)
* మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza)
* మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire)
* హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)
* మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga)
* టాటా నెక్సాన్ (Tata Nexon)
* మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift)
* మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)
* మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N).
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!