సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ పేరు మార్చుకోనున్నట్లు ప్రముఖ టెక్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోయినప్పటికీ, రానున్న వార్షిక సదస్సులో సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పేరు మార్చనున్నట్లు సమాచారం. ఇప్పటికే అమెరికా ప్రభుత్వంతో తలెత్తుతున్న సమస్యల వల్ల ఫేస్ బుక్ యూజర్ల సంఖ్య పడిపోతుందని భావించిన ఫేస్ బుక్ నిర్వాహకులు ఇలా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దిగ్గజ సమస్యలు అవసరాన్ని బట్టి మాతృ కంపెనీ పేరు మార్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
అయితే ఫేస్ బుక్ మాతృక పేరు మార్చి దాని కింద కే ఫేస్ బుక్ తో పాటు, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ లను తీసుకురానుంది. దీంతో ఫేస్ బుక్ అభిమానుల్లో అతృత నెలకొంది. ఒకవేళ ఫేస్ బుక్ పేరు మార్చితే ఏ పేరు పెడతారు..? అనే ప్రశ్న ప్రతి ఫేస్ బుక్ యూజర్ మదిలో మెదులుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే..