వాట్సాప్ ఆగిపోతే.. గుండె ఆగినంత పనైపోయింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం మనమంతా డిజిటల్ యుగంలో ఉన్నాం. మరుగుదొడ్డి లేని ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్ ఉందని గతంలో కొన్ని సర్వేలు వెల్లడించడం ఆశ్చర్యానికి గురిచేశాయి. అంటే మనిషి మొబైల్ ఫోన్లకు ఎంతలా అడిక్ట్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీ రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతుండటంతో అరచేతిలోనే ప్రపంచం ఇమిడిపోతుంది. కాళ్లు కదపకుండానే అన్ని నట్టింట్లోకి వచ్చిపడుతున్నాయి. గుండుసూది నుంచి లక్షలు ఖరీదు చేసే వస్తువుల దాకా ప్రతీఒక్కటి ఆన్ లైన్లో దొరుకుతున్నాయి. ఇలా ఆర్డర్ ఇచ్చామో లేదో అలా ఇంటికి చేరిపోతున్నాయి. దీంతో వీటికి మనిషి అట్రాక్ట్ అవుతున్నాడు.
ఇదంతా పైకి బాగానే కన్పిస్తుంది. అయితే టెక్నాలజీని అతిగా వాడటం వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈకామర్స్ సైట్స్ వచ్చాక ఖర్చు పెట్టడం ఎక్కువైంది. ఆఫర్లకు ఆకర్షితులై అవసరం లేకపోయినా వస్తువులను కొంటుండటం చూస్తూనే ఉన్నాం. డబ్బులు ఒకరిని నుంచి మరొకరికి పంపించడం సులువైంది. అదే సమయంలో ఏటీఎం పిన్ నెంబర్లు, ఓటీపీలు తస్కరణకు గురైతే ఇక అంతే అన్న దిగులు నెలకొంది. సైబర్ నేరాలు ఇటీవల కాలంలో ఎక్కువై పోయాయి. దీంతో ఒకింత భయాందోళన కూడా నెలకొంది.
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
మరోవైపు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం కంటే సోషల్ మీడియాలో గడిపే సమయమే ఎక్కువగా ఉంటుంది. ఫేస్ బుక్, ట్వీటర్, వాట్సాప్, ఇన్ స్ట్రాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటిని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్నారు. గుడ్ మార్నింగ్ తో మొదలు పెడితే గుడ్ నైట్ వరకు వీటిల్లోనే ఛాటింగులు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ లో అయితే ఒక్కొక్కరు పదేసి గ్రూపుల్లో మెంబర్లుగా ఉంటూ పిచ్చాపాటి చేస్తుంటారు.
ఇలాంటి సమయంలోనే ఫేస్ బుక్, వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది. నిన్నటి రాత్రి 9గంటల నుంచి ఉదయం వరకు వీటి సేవల్లో అంతరాయం ఏర్పడింది. దాదాపు 7గంటలపాటు వాట్సాప్, ఫేస్ బుక్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. నేటి ఉదయం కల్లా వాటి సేవలు తిరిగి పునరుద్ధరించబడ్డాయి. అయితే 7గంటలు యావత్ ప్రపంచం నిలిచిపోయినట్లు కన్పించింది. ముఖ్యంగా వాట్సాప్ ఆగిపోవడంతో ఎవరికీ కూడా కాలుచేయి పని చేయలేదు. రాత్రి నుంచి మేసేజ్ లు నిలిచిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొందరు పడిపోయారు. దాదాపు అందరిలోనూ ఇదే ఫీలింగ్ కన్పించింది.
అయితే తెల్లవారే వరకు వాట్సాప్, ఫేస్ బుక్ సేవలు పునరుద్ధించబడ్డాయి. ఒక్కొక్కరి మేసేజ్ లు తిరిగి రావడం ప్రారంభమయ్యాయి. దాదాపు ఏడుగంటల ఉత్కంఠకు తెరపడటంతో హమ్మయ్యా అంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఒక్క సంఘటనతో మనిషి సోషల్ మీడియాకు ఎంతలా బానిస అయ్యాడో అందరికి తెల్సి వచ్చింది. సోషల్ మీడియా ఇచ్చిన ఝలక్ నుంచి మనిషి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతి ఎప్పుడైనా అనర్థకారకమేనని నిన్నటి సంఘటన ద్వారా మరోసారి నిరూపించింది.
తాజావార్తలు
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!