వాట్సాప్ అదిరిపోయే ఆఫర్… రూ.1 పంపిస్తే.. రూ.51 క్యాష్ బ్యాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీఐ లావాదేవీలు జరిపేవారికి గూగుల్ పే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ పే యాప్ ప్రారంభంలో (అప్పట్లో ‘తేజ్’ యాప్) స్క్రాచ్ కార్డు ఆఫర్ ద్వారా తెగ పాపులర్ అయ్యింది. ఇప్పుడు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా గూగుల్ పే దారినే నమ్ముకుంది. వాట్సాప్ కూడా పేమెంట్స్ కేటగిరిలోకి అడుగుపెట్టడంతో యూజర్లను అట్రాక్ట్ చేయాలని తెగ ప్రయత్నిస్తోంది. దీంతో ఆఫర్లు ప్రకటించాలని నిర్ణయించుకుంది. యూజర్లు వాట్సాప్ పేమెంట్స్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే క్యాష్ బ్యాక్ ఇచ్చేలా రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ వినియోగదారులకు ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిందని తెలుస్తోంది.
Read Also: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
Also Read
గీవ్ క్యాష్.. గెట్ రూ.51 పేరుతో ఈ ఆఫర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. రూ.1 పంపితే రూ.51 క్యాష్ బ్యాక్‌ను లింకు చేసిన బ్యాంక్ అకౌంట్‌ను పంపుతోంది. ఇలా ప్రతి యూజర్‌కు ఐదు లావాదేవీల వరకు క్యాష్ బ్యాక్ రానుంది. అంటే వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ ద్వారా ఐదు సార్లు రూ.1 చొప్పున రూ.5 పంపితే రూ.51 చొప్పున రూ.255 వరకు క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. త్వరలోనే ఆండ్రాయిడ్, ఆపిల్ యూజర్లకు వాట్సాప్ ప్రవేశపెట్టిన ఆఫర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ యాప్‌లో చాట్ బార్ కుడిపక్కన పేమెంట్స్ అనే కేటగిరి కనిపిస్తుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను లింక్ చేయాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం గూగుల్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వడం బాగా తగ్గించేసింది. క్యాష్ బ్యాక్ స్థానంలో డిస్కౌంట్ కూపన్లు ఇస్తోంది. వాటి ద్వారా ఏదైనా కొనుగోలు చేస్తే డిస్కౌంట్ లభిస్తుంది.
తాజావార్తలు
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
ICC Rankings: జడేజా 1,683 రోజుల ఆధిపత్యానికి తెర.. నంబర్-1 ఆల్‌రౌండర్ స్థానాన్ని కోల్పోయిన జడ్డూ..
-
Nagpur MLC Election Result: నాగ్‌పూర్‌లో బీజేపీకి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం! ఎవరీ అభిజీత్ వంజారీ?
-
Hyderabad: రేస్ క్లబ్ సమీపంలో భారీ పేకాట స్థావరం గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్.!
-
US Fed Interest Rate Decision: అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం
ట్రెండింగ్
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!