మే 28 నుంచి కోల్‌కతాలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. హింసాత్మక నిరసనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం కారణంగా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడవద్దని 60 రోజుల పాటు పోలీసులు ఆంక్షలు విధించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారబోతుంది. ఈశాన్య దిశగా కదులుతూ 24 గంటలో తీవ్ర వాయుగుండంగా బలపడి "రేమాల్" తుఫాన్ గా ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. "రేమాల్" తీవ్ర తుఫాన్ గా మారి ఈనెల 27వ తేదీన అర్థరాత్రి తర్వాత తీరం దాటే అవకాశం ఉందని పేర్కొనింది.
బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. యూనిఫాం ధరించకుండ పాఠశాలకు వచ్చిన 6వ తరగతి విద్యార్థిని చితకబాదాడు హెడ్ మాస్టర్. తీవ్రంగా కొట్టడంతో వీపుపై పెద్దపెద్ద గాయాలయ్యాయి. ఈ ఘటనలో ప్రధానోపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌కు రెమల్‌గా నామకరణం చేశారు. రుతుపవనాల రాకకు ముందుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫాన్ ఏర్పడింది. అయితే ఈ తుఫాన్‌తో ఏపీకి ఎలాంటి ప్రమాదం లేదు.
Anwarul Azim : బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకేసులో పెద్ద విషయం బట్టబయలైంది. ఈ హత్యకు ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ స్నేహితుడు సుమారు రూ.5 కోట్ల కాంట్రాక్టు ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని బెంగాల్ సీఐడీ తెలిపింది.
Anwarul Azim : బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్యకు సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ మే 13న తన న్యూటౌన్ ఫ్లాట్‌లో గొంతు కోసి దారుణంగా చంపబడ్డాడు.
సార్వత్రిక ఎన్నికల వేళ కలకత్తా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీచర్ రిక్యూట్మెంట్ రద్దు చేసిన న్యాయస్థానం.. తాజాగా ఓబీసీ సరిఫికెట్లను రద్దు చేస్తూ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది.
Congress: ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తానని ఇటీవల బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించింది. అయితే, ఆమె ప్రకటనపై బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉద్యోగం ఆశ చూపించి మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్లు వారు తెలిపారు.