West Bengal: పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై డ్యాన్సర్ లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376, 120బి కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.
High Court : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు (transgender persons) ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాల్లో సమానమైన విధానాన్ని అవలంబిస్తున్నదని పేర్కొన్న కోర్టు, అయితే వారికి ఇంకా రిజర్వేషన్లు కల్పించలేదని పేర్కొంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని జస్టిస్ రాజశేఖర్ మంథా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. టీచర్స్ ఎలిజిబిలిటీ…
Bangladeshi MP Murder: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్యం కోసం కోల్‌కతా వచ్చిన అతను దారుణహత్యకు గురయ్యాడు. చివరకు అతని డెడ్‌బాడీ కూడా దొరక్కుండా అత్యంత దారుణంగా చర్మాన్ని ఒలిచి, మాంసాన్ని, ఎముకలను వేరు చేసి పలు ప్రదేశాల్లో పారేశారు
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సాకేత్ గోఖలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు బీజేపీ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు.. త్వరలో లోక్‌సభలో బీజేపీ బలం 237కి తగ్గుతుందని ఆయన తెలిపారు.
బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఉప ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది.
Bangladesh MP Murder Case: గత నెలలో బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకు గురైన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్యం కోసం కోల్‌కతా వచ్చిన ఆయనను దారుణంగా హత్య చేశారు. ఇప్పటికే ఆయన బాడీని రికవరీ చేయడం దర్యాప్తు అధికారులకు కష్టంగా మారింది. అంత పకడ్బందీగా ఈ హత్యకు పాల్పడ్డారు. మే 12న కోల్‌కతాకు వచ్చిన అన్వరుల్, ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడు. బెంగాల్ సీఐడీ ప్రకారం, జిహాద్ హవ్లాదార్, సియామ్ హుస్సేన్…
బెంగాల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత కూడా హింస కొనసాగుతోంది. శనివారం రాత్రి నుంచి పలుచోట్ల బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడికి కారణం తృణమూల్ కాంగ్రెస్ (TMC) మద్దతుదారులేనని బీజేపీ ఆరోపిస్తుంది. కాగా.. వరుస దాడులతో భయాందోళనకు గురైన పలువురు బీజేపీ కార్యకర్తలు ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. మరి కొందరు పార్టీ కార్యాలయాల్లో తలదాచుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్, మథురాపూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు సోమవారం ఒక్కో పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య నేడు రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఈ కేంద్రాల్లో జూన్ 1న ఓటింగ్ నిర్వహించగా.. అ ఫిర్యాదులు రావడంతో మళ్లీ ఇక్కడ ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
Exit Polls: లోక్‌సభ ఎన్నికలు-2024కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌లో సంచనల ఫలితాలు వెలువడుతున్నాయి. మరోసారి నరేంద్రమోడీ అధికారంలోకి రాబోతున్నారని మెజారిటీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్లో హింస చెలరేగింది. శనివారం జరుగుతున్న లోక్‌సభ చివరి దశ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుండి చెదురుమదురు హింసాత్మక ఘటనలు మళ్లీ వెలువడుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ 24 పరగణాల జిల్లా జయనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కుల్తాలి ప్రాంతంలో ఓ ఘటన వెలుగు చూసింది. ఇక్కడి పోలింగ్ బూత్‌లో ఉదయం ఓటింగ్ ప్రారంభమైన తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉన్న కొందరు వ్యక్తులు.. స్థానిక ప్రజలను ఓటింగ్ చేయకుండా నిలిపివేశారని ఆరోపించారు. దీనికి…