Trinamool MLA: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్రా ‘శ్రీరాముడు’ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘శ్రీరాముడు హిందువు కాదు, ముస్లిం’’ అని ఆయన చేసిన కామెంట్స్‌పై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. బీజేపీ నేత ప్రదీప్ భండారి ఎక్స్‌లో ఈ వ్యాఖ్యలకు చెందిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు.
Messi row: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోల్‌కతాలో మెస్సీ పర్యటనలో వైఫల్యం అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో సంచలనంగా మారింది. విపక్షాల నుంచి సాధారణ ప్రజల వరకు ప్రభుత్వం, అధికారుల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.
Lionel Messi: లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ నిర్వాహకుడు శతద్రు దత్తాకు బెయిల్ నిరాకరిస్తూ, 14 రోజలు పోలీస్ కస్టడీకి పంపించారు. అర్జెంటీనా సూపర్ స్టార్ మెస్సీ పర్యటన సందర్భంగా శనివారం మధ్యాహ్నం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్రం గందరగోళం తలెత్తింది. స్టేడియంలో మెస్సీని చూసేందుకు భారీ స్థాయిలో ఆయన అభిమానులు, ప్రేక్షకులు వచ్చారు. అయితే, మెస్సీని వీఐపీలు, రాజకీయ నాయకులు చుట్టుముట్టి ఉండటం, ఆయనను చూసే అవకాశం రాకపోవడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
Himanta Sarma: ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన తీవ్ర గందగోళానికి దారి తీసింది. ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మెస్సీ 'GOAT టూర్ 2025' గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ ఈ గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత.
Kolkata Messi Tour Chaos: కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఏర్పడిన గందరగోళంపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ CV ఆనంద బోస్ సీరియస్‌గా స్పందించారు.
West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మిస్తానని, దానికి శంకుస్థాపన చేసిన తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. బాబ్రీ మసీదును కూల్చేసిన డిసెంబర్ 6న ఆయన బెల్దంగాలో మసీదుకు శంకుస్థాపన చేశారు. అయితే, ఈ వివాదంపై తృణమూల్ ఈయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీని తర్వాత, కబీర్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ వచ్చే ఏడాది అధికారంలోకి రాకుండా చేస్తానని హెచ్చరించారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మించాలనే ప్రతిపాదనపై తీసుకొచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు
వచ్చే ఏడాది ప్రారంభంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి నాలుగోసారి అధికారం కోసం మమత.. ఈసారైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తహతహలాడుతున్నాయి.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘‘తెలివైన కుట్ర’’కు తెర తీశారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావని ఆమె హెచ్చరించారు.