వాసుదేవరావు, హర్షిత, శిరీష, అవోన్ స్కైస్ కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ఎక్స్ పోజ్డ్’. ఈ షో కు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు షో రన్నర్ గా వ్యవహరిస్తూ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పది వారాల ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 80 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఓ న్యూస్ ఛానెల్ నేపథ్యంగా ఇద్దరు మహిళల మైండ్ గేమ్ తో సాగే ఈ కథ ఆసక్తికరంగా ఉంటుందంటున్నారు. ఇతర భాషల్లో ఈ ఫార్మాట్ ఇప్పటికే మంచి…
టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. అయితే కొంతకాలంగా ఆయన సినిమాలు ప్రేక్షకులకు రుచించడం లేదు. కృష్ణవంశీ కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమాలను తెరకెక్కించలేకపోతున్నారు. గులాబీ, నిన్నే పెళ్లాడతా, సింధూరం, మురారి, ఖడ్గం, చందమామ వరకు గుర్తుండిపోయే సినిమాలు తీసిన కృష్ణవంశీ ఆ తర్వాత హిట్ అందుకోలేకపోయారు. లేటెస్టుగా ఆయన ‘రంగ మార్తాండ’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ…
ఓటీటీ అంటే ఓవర్ ది టాప్ అని అర్ధం. లాక్‌డౌన్ పుణ్యమా అంటూ ఓటీటీలకు భారీగా డిమాండ్ పెరిగింది. స్మార్ట్ టీవీల రాక కూడా ఓటీటీలకు ప్లస్ పాయింట్‌గా మారింది. దీంతో ఓటీటీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే అన్ని ఓటీటీలకు సపరేట్‌గా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే సామాన్యుడికి భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లే ప్రీమియం బంపర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో 12 ఓటీటీల కంటెంట్ వీక్షించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వీటిలో సోనీ…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అనేక వెబ్ సిరీస్ LGBTQ కు జై కొడుతున్నాయి. లెస్సియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వశ్చనింగ్- అంటూ ఈ తరహా కేరెక్టర్స్ తోనే పలు పాత్రలు రూపొంది, వెబ్ సిరీస్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ట్వైలైట్’ బ్యూటీ క్రిస్టెన్ స్టివార్ట్ ‘క్వీర్ పారానార్మల్ రియాలిటీ సిరీస్’లో పాలు పంచుకొనేవారి కోసం ఆడిషన్స్ మొదలెట్టింది. ఇప్పటి దాకా ఎవరూ చూడనటువంటి ‘ఘోస్ట్ హంటింగ్ షో’ను…
కరోనా కారణంగా రెండేళ్ళ పాటు ఇండస్ట్రీ అల్లకల్లోలం అయిపోయింది కానీ ఇప్పుడు పెద్ద, చిన్న సినిమాల షూటింగ్స్ తో అందరినీ యమా బిజీ చేసేసింది! జయాపజయాలతో సంబంధం లేకుండా చాలా మంది హీరోలు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. చిరంజీవి మొదలుకొని కుర్ర హీరోల వరకూ అందరూ నాలుగైదు సినిమాలు చేస్తుండటం విశేషం. కాస్తంత గుర్తింపు ఉన్న ఏ హీరో జాబితా చూసినా రెండు సినిమాలకు మించి వారు కమిట్ అయినట్టు కనిపిస్తోంది. ఇటీవల త్రిగుణ్ గా…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ మొదటి నుండి వైవిధ్యమైన కథా చిత్రాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలను ఓసారి చూస్తే… ఈ విషయం అర్థమౌతుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలనూ రూపొందించిన క్రిష్ కు పరభాషా చిత్రాలను రీమేక్ చేసి తెలుగువారికి అందించడం కూడా ఇష్టమే. ఆయన దర్శకత్వం వహించకపోయినా అలా కొన్ని తమిళ చిత్రాలను తెలుగువారి ముందుకు క్రిష్ తీసుకొచ్చారు. అలానే నవలలను సినిమాలుగా తీయడం ఆయనకు ఇష్టం. ఆ…
ప్రస్తుతం ఉన్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అతి తక్కువ మొత్తానికి వినోదాన్ని అందిస్తున్న సంస్థ ఆహా! కేవలం 299 రూపాయలతో యేడాది పాటు కంటెంట్ ను చూసే సౌకర్యం ఉంది. అయితే వ్యూవర్స్ ను మరింతగా పెంచుకునేందుకు తాజాగా ఆహా ఓ కొత్త ఆకర్షణీయమైన ప్లాన్ తో వచ్చింది. మూడు నెలల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ ను కేవలం రూ. 99 రూపాయలతో పొందే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ మొత్తంతో…
మూడు దశాబ్దాల క్రితం రాయలసీమలోని తాడిపత్రిలో జరిగిన ఓ హత్యను ఆధారంగా చేసుకుని ‘రెక్కీ’ వెబ్ సీరిస్ రూపుదిద్దుకుంది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్య, తదనంతర పరిణామాలతో ఈ మర్డర్ మిస్టరీ వెబ్ సీరిస్ ను పోలూరి కృష్ణ తీశారు. ఇరవై ఐదు నిమిషాల నిడివితో ఏడు ఎపిసోడ్స్ గా రూపుదిద్దుకున్న ‘రెక్కీ’ని జూన్ 17న జీ 5లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. పోలీస్ ఇన్ స్పెక్టర్ లెనిన్ గా శ్రీరామ్ నటించగా, శివ బాలాజీ, ధన్యా…
ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి! ఆయన ఆహ్లాదకర రచలే కాదు… భిన్నమైన నవలలూ రాశారు. నిజం చెప్పాలంటే మల్లాది టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. ఆయన నవలలు అనేకం సినిమాలుగా వచ్చి మంచి విజయం సాధించాయి. మల్లాది రాసిన ‘9 అవర్స్’ అనే నవల ఆధారంగా క్రిష్ జాగర్లమూడి షో రన్నర్ గా అదే పేరుతో ఓ వెబ్ సీరిస్ తాజాగా రూపుదిద్దుకుంది. ఇది జూన్ 2 నుండి డిస్నీ ప్లస్ హాట్…
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇప్పుడు డిజిటల్ మీడియాలోకీ అడుగుపెట్టాడు. అతను నటిస్తున్న ‘ది బాయ్స్’ వెబ్ సీరిస్ సీజన్ 3 జూన్ 3 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రచారానికి శ్రీకారం చుట్టిన షాహిద్ కపూర్ ఈ వెబ్ సీరిస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. ”సహజంగా సూపర్ హీరోస్ అంటే సమాజానికి, తమ చుట్టు ఉన్న ప్రజలకు మేలు చేస్తారు. కానీ నేను నటించిన…