ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అనేక వెబ్ సిరీస్ LGBTQ కు జై కొడుతున్నాయి. లెస్సియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వశ్చనింగ్- అంటూ ఈ తరహా కేరెక్టర్స్ తోనే పలు పాత్రలు రూపొంది, వెబ్ సిరీస్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ట్వైలైట్’ బ్యూటీ క్రిస్టెన్ స్టివార్ట్ ‘క్వీర్ పారానార్మల్ రియాలిటీ సిరీస్’లో పాలు పంచుకొనేవారి కోసం ఆడిషన్స్ మొదలెట్టింది. ఇప్పటి దాకా ఎవరూ చూడనటువంటి ‘ఘోస్ట్ హంటింగ్ షో’ను చూపించబోతున్నానని క్రిస్టెన్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ‘ఎల్.జి.బి.టి.క్యూ.’ ఘోస్ట్ హంటర్స్ బయలు దేరారనీ అంటోంది. విపరీతమైన వికృత చేష్టలతో సాగే లైంగికచర్యలు చూడబోతున్నారనీ క్రిస్టెన్ యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవలే మన దేశంలో మొట్టమొదటి ‘సోలోగమి’గా క్షమ బిందు నిలచింది. అంటే తనను తాను వివాహం చేసుకొని క్షమ బిందు మన దేశంలో ఓ చరిత్ర సృష్టించింది. ఇలాంటి స్వవివాహం జరగడం 2014లోనే జపాన్ లోని క్యోటోలో మొదలయిందట! అదే యేడాది ఓ బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ తనను తాను పెళ్ళాడింది. 2017లో ఇటలీలోనూ ఇలాంటి కేసులు వెలుగు చూశాయి. మన దేశంలో మాత్రం క్షమ బిందుతోనే ‘సోలోగమి’ మొదలయింది. విపరీత లైంగిక పోకడలకు కేంద్రబిందువుగా సాగే క్రిస్టెన్ స్టివార్ట్ రియాలిటీ సిరీస్ లో ఈ ‘సోలోగమి’ని కూడా చేరుస్తారా? అంటూ అప్పుడే క్రిస్టెన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తనను తాను పెళ్ళి చేసుకొనేవారు చేసేది ఏముంటుంది? మరదే వరైటీ అంటే… అంటున్నారు క్వీర్ రియాలిటీ సిరీస్ ప్రియులు.