Krishna Vamsi: తెలంగాణ సాయుధ పోరాటంపై వెబ్ సిరీస్.. 300 కోట్ల బడ్జెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. అయితే కొంతకాలంగా ఆయన సినిమాలు ప్రేక్షకులకు రుచించడం లేదు. కృష్ణవంశీ కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమాలను తెరకెక్కించలేకపోతున్నారు. గులాబీ, నిన్నే పెళ్లాడతా, సింధూరం, మురారి, ఖడ్గం, చందమామ వరకు గుర్తుండిపోయే సినిమాలు తీసిన కృష్ణవంశీ ఆ తర్వాత హిట్ అందుకోలేకపోయారు. లేటెస్టుగా ఆయన ‘రంగ మార్తాండ’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత రైతుల సమస్యల ఆధారంగా ‘అన్నం’ అనే సినిమాను కృష్ణవంశీ తెరకెక్కించనున్నారు.
Read Also: ప్రపంచంలోని అత్యధిక జనాభా గల టాప్-10 దేశాలు
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
మరోవైపు సినిమాల కంటే ఓటీటీలలోని వెబ్ సిరీస్‌లనే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్న నేపథ్యంలో కృష్ణవంశీ కూడా ఓటీటీలలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు దేశ చరిత్రలోనే భారీ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తారని.. దీని కోసం రూ.300 కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు తెలుగులో వెబ్ సిరీస్ కోసం ఎవరూ ఈ రేంజ్‌లో బడ్జెట్ ఖర్చు చేయలేదు. అటు సుదీర్ఘకాలం నడిచిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ అన్ని అంశాలను సినిమాలలో చూపించలేకపోయారు. వెబ్ సిరీస్ అయితే ప్రతి అంశాన్ని వివరించవచ్చు. అందుకే 50 ఎపిసోడ్లుగా ఈ అంశాన్ని వెబ్ సిరీస్‌గా తీయాలని కృష్ణవంశీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించనున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..