Sony Liv: క్రిష్ డైరెక్షన్ లో ‘కన్యాశుల్కం’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ మొదటి నుండి వైవిధ్యమైన కథా చిత్రాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలను ఓసారి చూస్తే… ఈ విషయం అర్థమౌతుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలనూ రూపొందించిన క్రిష్ కు పరభాషా చిత్రాలను రీమేక్ చేసి తెలుగువారికి అందించడం కూడా ఇష్టమే. ఆయన దర్శకత్వం వహించకపోయినా అలా కొన్ని తమిళ చిత్రాలను తెలుగువారి ముందుకు క్రిష్ తీసుకొచ్చారు. అలానే నవలలను సినిమాలుగా తీయడం ఆయనకు ఇష్టం. ఆ మధ్య తానా బహుమతి పొందిన ‘కొండపొలం’ నవలను అదే పేరుతో క్రిష్ సినిమాగా రూపొందించారు. ఈ మధ్య కాలంలో సినిమాలే కాకుండా డిజిటల్ మీడియా మీద కూడా క్రిష్ దృష్టి పెట్టారు. తాజాగా ఆయన మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ‘9 గంటలు’ నవలను అదే పేరుతో వెబ్ సీరిస్ గా తీశారు. తొమ్మిది ఎపిసోడ్స్ గా రూపుదిద్దుకున్న ఈ వెబ్ సీరిస్ కు క్రిష్ షో రన్నర్ గా వ్యవహరించారు.
Also Read
విశేషం ఏమంటే… తాజాగా క్రిష్ వందేళ్ళకు పైగా చరిత్ర కలిగిన గురజాడ అప్పారావు నాటకం ‘కన్యాశుల్కం’ను వెబ్ సీరిస్ గా మలచబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఈ వెబ్ సీరిస్ లో నటించబోతున్నారు. సోనీ లివ్ కోసం క్రిష్ ఈ నవలను వెబ్ సీరిస్ గా తీస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే… 1955లోనే ‘కన్యాశుల్కం’ నాటకంను దర్శకులు పి. పుల్లయ్య ఎన్టీయార్, సావిత్రి, సీఎస్ఆర్, గోవిందరాజులు సుబ్బారావు, షావుకారు జానకి, విన్నకోట రామన్న పంతులు, గుమ్మడి, వంగర తదతరులు ప్రధాన తారాగణంగా తెరకెక్కించారు. తొలి తెలుగు ఆధునిక నాటకాలలో ఒక్కటైన ‘కన్యాశుల్కం’ను ఈ తరం మెచ్చేలా క్రిష్ ఎలా రూపొందిస్తారో చూడాలి!
తాజావార్తలు
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?