అమెరికన్ క్రైమ్ డ్రామా సీరిస్ ‘రే డోనోవన్’ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది ‘రానా నాయుడు’. నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మితమౌతున్న ఈ వెబ్ సీరిస్ లో మొట్టమొదటి సారి వెంకటేశ్ నటిస్తుండటం విశేషం. అలానే మొదటిసారి బాబాయ్ వెంకటేశ్ తో కలిసి ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్ ను ఇందులో చేస్తున్నాడు రానా. ఇల్లీగల్ వ్యవహారాలు చేసే వ్యక్తిగా రానా నటిస్తుండగా, అతని తండ్రిగా, జైలు నుండే అన్ని కార్యక్రమాలను సెట్ చేసే గ్యాంగ్ స్టర్ గా వెంకటేశ్…
ప్రియాంక చోప్రా.. పరిచయం అక్కర్లేని పేరు. ఈమధ్య కాలంలో ఈ అమ్మడు ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లోకెక్కుతోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఒక ఫోటోతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఆ ఫోటోలో ప్రియాంక ముఖంపై మనం రక్తపు మరకల్ని గమనించవచ్చు. పెదాలు చిట్లిపోయి, ముక్కలో నుంచి రక్తం రావడాన్ని కూడా చూడొచ్చు. ఫేస్‌పై అక్కడక్కడ దద్దర్లు సైతం ఉన్నాయి. ఎవరైనా ఈ ఫోటోని చూసిన వెంటనే.. ప్రియాంకను ఎవరో కొట్టారనో లేదా ఆమెకి ఏదో ప్రమాదం జరిగిందనో…
‘ఆహా’లో స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు నిర్వహించిన ‘Sarkar ‘gameషోకు అప్పట్లో చక్కని స్పందన లభించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అగస్త్య ఆర్ట్స్ సంస్థ ఇప్పుడు సీజన్ 2కు రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ 29 నుండి ప్రతి శుక్రవారం సాయంత్రం 6.00 గం.లకు ఈ గేమ్ షో ప్రసారం కానుంది. రెట్టించిన థ్రిల్, రెట్టించిన ఎగ్జయిట్ మెంట్, రెట్టించిన ఎంటర్ టైన్ మెంట్ తో ఈ రియాలిటీ షో ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి ఎపిసోడ్…
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు, హరీష్ శంకర్ సంయుక్తంగా జీ5 కోసం రూపొందిస్తున్న వెబ్ సీరిస్ ‘ఏటీఎం’ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. బిగ్ బాస్ 5 ఫేమ్ సన్నీ, దివితో పాటు సుబ్బరాజు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నెల 27 నుండి దీని రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. ‘దిల్’ రాజు ఫ్యామిలీ నెక్ట్స్ జనరేషన్ కు చెందిన హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి ఈ వెబ్ సీరిస్ ను నిర్మిస్తున్నారు. సి.…
యాక్షన్ ఎంటర్ టైనర్స్ ను తెరకెక్కించడంలో రోహిత్ శెట్టిది ఓ ప్రత్యేక శైలి. అలానే ‘సింగం’ మూవీ నుండి కాప్ యాక్షన్ చిత్రాల్లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు రోహిత్ శెట్టి. అలా వచ్చిన ‘సింగం రిటర్న్స్’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ‘సింగం -3’ కూడా తెరకెక్కబోతోంది. ఇదిలా ఉంటే రోహిత్ శెట్టి ఇప్పుడు ఓటీటీ బాట పట్టాడు. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో సిద్ధార్థ్ మల్హోత్రాతో అమెజాన్ ప్రైమ్ కోసం…
నేడు (ఏప్రిల్ 16) విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి పుట్టినరోజు. గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో క్రియాశీల నటుడిగా వెలుగొందుతున్న జేడీ చక్రవర్తి ప్రస్తుతం తెలుగు పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో డిఫరెంట్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. హిందీలో ‘ఏక్ విలన్ పార్ట్- 2’, ఆయుష్మాన్ ఖురానాతో కొత్త సినిమా, ‘దహిని’తో పాటు మరో థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. సోని, ప్రైమ్ కలిసి నిర్మిస్తున్న…
తెలుగులో సీనియర్ హీరోలే కాదు యువ కథానాయకులు కూడా ఇప్పుడు వెబ్ సీరిస్ లో నటించడానికి ముందుకొస్తున్నారు. ఇటీవలే సుశాంత్ ఓ వెబ్ సీరిస్ లో నటిస్తున్నట్టు ప్రకటించాడు. తాజాగా మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ సైతం వెబ్ సీరిస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. జీ 5 ఒరిజినల్ వెబ్ సీరీస్ ‘అహ నా పెళ్ళంట’లో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ గా శివానీ రాజశేఖర్ నటిస్తోంది. గతంలో ‘ఏబీసీడీ’ చిత్రాన్ని డైరెక్ట్…
చాయ్ బిస్కెట్ సంస్థ గర్ల్ ఫార్ములా కేటగిరిలో స్ట్రీమింగ్ చేస్తున్న ‘థర్టీ వెడ్స్ ట్వంటీ వన్’ సీజన్ 2, ఐదవ ఎపిసోడ్ ఆదివారం నుండి అందుబాటులోకి వచ్చింది. లాస్ట్ ఎపిసోడ్ మొత్తం కార్తీక్ తండ్రి కావడం మీద నడిపిన డైరెక్టర్ పృథ్వీ వనం ఇప్పుడీ లేటెస్ట్ ఎపిసోడ్ ను మేఘన బర్త్ డే, దాని పర్యవసానంపై తీశాడు. కొత్త ఉద్యోగంతో సతమతమౌతున్న మేఘన బర్త్ డే ను కాస్తంత స్పెషల్ గా జరపాలని పృథ్వీ భావిస్తాడు. ఆమె…
అక్కినేని నాగ చైత్నన్య వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే బంగార్రాజు చిత్రంతో హిట్ ని అందుకున్న ఈ హీరో ప్రస్తుతం థాంక్యూ సినిమాను ఫినిష్ చేసే పనిలో పడ్డాడు.. మరోపక్క హిందీలో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దాలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా అమెజాన్ ప్రైమ్ కోసం ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెల్సిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ కి దూత అనే…
బిగ్ బాస్ 5 ఫేమ్ మానస్ కొత్త వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే పలు చిత్రాలలో, సీరియళ్లలో నటించి చక్కని గుర్తింపు పొందిన మానస్ తొలిసారి ఓటీటీ కోసం ఈ వెబ్ సీరిస్ లో నటిస్తున్నాడు. అతని సరసన ‘రాజన్న’ ఫేమ్ యానీ నాయికగా నటించబోతోంది. విశేషం ఏమంటే మానస్ లానే యానీ సైతం బాలనటిగా తన కెరీర్ ను ప్రారంభించింది. అయితే ఇప్పటికే ఆమె ‘లూజర్’ వెబ్ సీరిస్ లో కీలక పాత్రను…