Weather News: తెలంగాణకు చల్లటి కబురు అందింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోని మరికొన్ని భాగాలకు విస్తరించాయి. రాగల 2,3 రోజులలో ద్వీపకల్ప దక్షిణ భారతదేశంలోని మరి కొన్ని భాగాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
Read Also: Guntur Kaaram: మహేష్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. రిలీజ్ పక్కా ఆరోజే!
దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య / పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని పేర్కొంది. దీంతో రాగల మూడు రోజులకు వాతావరణ కేంద్రం పలు సూచనలు చేసింది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు. మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Read Also: Ram Charan: చరణ్- ఉపాసన బిడ్డకు జోలపాట.. గిఫ్ట్ ఇచ్చిన కీరవాణి కొడుకు
మరోవైపు ఈరోజు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు విపరీతంగా కొడుతుండటంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సమయం కల్లా వర్షాలు పడాలని రైతులు తెలుపుతుండగా.. వర్షం ఎప్పుడెప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వార్త విన్నారంటే రైతుల కళ్లలో ఆనందం కనపడుతుంది.