AP Weather Report for Upcoming 3 Days: మన దేశంలో అత్యధిక వర్షపాతం అందించే నైరుతి రుతుపవనాలు ఈ సారి ఆలస్యం అయ్యాయి. ముందే రావాల్సి ఉన్నా కాస్త ఆలస్యంగా ఈ నెల 8న కేరళను తాకాయి. జూన్ 11న ఏపీ, తమిళనాడు వంటి ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా ఈ రుతుపవనాలు ప్రవేశించాయి. ఇక ఈ రుతుపవనాల గురించి అమరావతి వాతావరణ కేంద్రం సమాచారం ఇచ్చింది. ఆ సమాచారం మేరకు నైరుతి రుతుపవనాలు కర్ణాటక, కొంకణ్ సహా మిగిలిన ప్రాంతాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతం, చాలా ప్రాంతాల్లో ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం అలాగే బీహార్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు విస్తరించనున్నాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో పడమటి గాలులు వీస్తున్నాయని తెలిపింది.
Also Read: Actor Satpagiri: త్వరలోనే టీడీపీలోకి సప్తగిరి.. పోటీకి సిద్ధంగా ఉన్నా
ఇక అలాగే రాబోవు మూడు రోజులకు గాను ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాం వాతావరణ సూచనలు ఈ మేరకు ఉన్నాయి.
జూన్ 12:
ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే తీవ్రమైన వడగాలులు గంటకు 30 -40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీసే అవకాశముంది.
జూన్ 13 :-
రేపు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే తీవ్రమైన వడగాలులు గంటకు 30 -40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీసే అవకాశముంది.
జూన్ 14:-
ఇక ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అంతేకాక ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. అలాగే వడగాలులు గంటకు 30 -40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీసే అవకాశముంది.
Also Read: Nedurumalli Ramkumar Reddy: బ్రష్టుపట్టించాలనే ఇలా చేశారు..’ఆనం’పై నేదురుమల్లి విమర్శల వర్షం
రాయలసీమలో జూన్ 12:-
అంటే ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని, వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీసే అవకాశముంది .
జూన్ 13 :-
రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది, వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీసే అవకాశముంది .
జూన్ 14:-
ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని, వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించారు. అలాగే బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీసే అవకాశముందని చెబుతున్నారు.