ఎండలో బయటకు వచ్చిన వారు వడదెబ్బకు గురవుతున్నారు. అయితే వడదెబ్బ తగిలితే ఏం చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం.. వడదెబ్బ లక్షణాలు.. సాధారణంగా చాలా మందికి వడదెబ్బ అంటే ఏంటో సరిగా తెలియకపోవచ్చు. ఏదో నీరసంగా ఉంది కొంచెం సేపు రెస్టో తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ అదే పొరపాటు. వడదెబ్బ తగిలిని వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
భానుడి ప్రతాపంతో ఉక్కపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్లు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిని వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
భారతదేశం తీవ్రమైన వేసవిని ఎదుర్కొంటోంది. దేశంలోని చాలా ప్రాంతాలలో ఈరోజు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారత వాతావరణ విభాగం (IMD) సోమవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నగరాల జాబితాను విడుదల చేసింది, అగ్రస్థానంలో ఉన్న నగరం 43 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.
విశాఖ నగరం పగలంతా హీట్ ఐలాండ్ ను తలపిస్తోంది. ఉదయం, సాయంత్ర దట్టమైన తేమగాలులు వీస్తున్నాయి. ఇది అసాధారణమైన పరిణామం కాకపోయినప్పటికీ సమ్మర్ తీవ్రత ఎంత స్థాయిలో పెరిగిందో గుర్తించవచ్చంటున్నారు వాతావరణ నిపుణులు.
వేసవిలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. చాలా రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్‌తో సహా దేశంలోని కొన్ని ప్రాంతాలలో రాబోయే మూడు, నాలుగు రోజులలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాబోయే మూడు గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సూచించింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. నగర శివార్లలోని దేవనహళ్లిలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేవనహళ్లిలోని కేఐఏలో మంగళవారం సాయంత్రం 45.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈనెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
వైజాగ్ వన్డేలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.