మసాలా వంటలకు, నాన్ వెజ్ వంటలకు అల్లం లేనిదే రుచి ఉండదు.. చిన్న ముక్క నూరి వేస్తే ఆ టేస్ట్ వేరే లెవల్ అనే చెప్పాలి.. ఇకపోతే అల్లం ను ఆయుర్వేదంగా కూడా వాడుతున్నారు. దాంతో ఈ పంటను వేసేందుకు రైతులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.. అల్లం సాగుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కావు. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లంసాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ వున్న ప్రాంతంలో కూడా అల్లం పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. 19 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో పంట పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. తెలంగాణాలో మెదక్ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోను, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో అల్లం పంటను సాగుచేస్తున్నారు..విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో చల్లని వాతావరణం ఉండటంతో ఇక్కడి రైతులు అనాదిగా అల్లం పంటను సాగుచేస్తూ ఉన్నారు. అయితే చీడపీడల కారణంగా అనుకున్న దిగుబడులను సాధించలేకపోతున్నారు. ఈ నేపధ్యంలోనే చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు మారన్ అల్లం రకాన్ని ఎత్తుమడుల విధానంలో ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్నారు. ఈ పంట 9నెలలకు చేతికి వస్తుంది.. దాంతో అంతర పంటలను కూడా పండిస్తున్నారు..
ఎత్తు మడుల విధానంలో అల్లం సాగు చేస్తే తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడి సాధించవచ్చు. అల్లం సుగంధ ద్రవ్యపు పంట. అల్లం సాగుకు అన్ని నేలలు అనుకూలంగా ఉండవు. తేమతో కూడిన వేడి వాతావరణం ఉండే నేలను అల్లం సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. నీడ ఉండే ప్రాంతాల్లో కూడా అల్లం సాగులో అధిక దిగుబడి సాధించవచ్చు. కాకపోతే 19 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో అల్లం పంటను సాగు చేస్తే ఆసాజనకంగా ఉంటుంది.. ఇలా చెయ్యడం వల్ల డబుల్ ఆదాయం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. పొలాన్ని లోతుగా దున్నడం వల్ల అల్లం ఉత్పత్తి పెరుగుతుందని, కలుపు విషయంలో శ్రద్ద తీసుకోవాలని చెబుతున్నారు.. ఈ పంటను కూడా పసుపు పంట విధానంలో వేస్తారు.. కాబట్టి సాళ్ళ మధ్యలో నడిచేందుకు వీలుగా దూరం పెట్టుకోవడం మంచిదని అంటున్నారు.. ఈ విధానం గురించి ఇంకేదైనా సందేహాలు ఉంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..