Weather Update: జూన్‌లో 30 శాతం తగ్గిన వర్షపాతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Update: దేశంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. రుతు పవనాలు ఆలస్యంగా రావడంతో ఈ ఏడాది జూన్‌లో వానలు కురవలేదు. దీంతో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జూన్‌లో 30 శాతం తగ్గిన వర్షపాతం తగ్గినట్టు నివేదికలు తెలియజేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవడంతో వానలు కురవాల్సినంతగా కురవలేదు. ఈ ఏడాది జూన్‌లో సాధారణం కంటే 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే జూన్ 24 నాటికి 4 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీని వల్ల రిజర్వాయర్లలో నీటిమట్టాలు అడుగంటుతున్నాయని.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకటించింది.
Read also: Sri Ganesha Stotra Parayanam: నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే విఘ్నాలు తొలిగి శుభాలు చేకూరుతాయి
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
జూన్ 22 నాటికి దక్షిణాదిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం 26 శాతానికి చేరుకున్నాయని నివేదికలో పేర్కొంది. ఇది గడిచిన నాలుగేండ్లలో కనిష్ఠమని తెలిపింది. బిపర్జాయ్ తుఫాను కారణంగా రుతుపవనాల రాక ఆలస్యమైందని నివేదిక పేర్కొంది. దీని కారణంగా వాయవ్యం మినహా దేశమంతటా సాధారణం కంటే తక్కువ వర్షపాతాలు నమోదవుతున్నాయని తెలిపింది. దక్షిణాదిలో సాధారణం కంటే 51 శాతం తక్కువగా వర్షపాతం నమోదవ్వగా.. మధ్య భారత్‌లో 51 శాతం, పశ్చిమ, ఈశాన్య రీజియన్లలో 19 శాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్టు నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాదిలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ ఏడాది మొత్తం పడాల్సిన వర్షపాతంలో జూన్‌లో అతితక్కువగా 19 శాతం వర్షపాతం నమోదవ్వనుండగా.. జులైలో మూడింట ఒక వంతు, ఆగస్టులో 29 శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది.
Read also: Salman Khan : సల్మాన్ ను చంపేస్తాం.. బహిరంగ హెచ్చరిక
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటివరకు 4.5 శాతం పంటలే సాగయ్యాయి. గతేడాదితో పోలిస్తే వరి (-36), పత్తి (-14.2), జనపనార (-12.2) శాతం మేర సాగు తగ్గింది. తెలంగాణలో సాధారణం కంటే 64 శాతం వర్షపాతం నమోదయింది. ఇక పశ్చిమబెంగాల్‌లో 28 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 52 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 38 శాతం, ఒడిశాలో 54 శాతం, చత్తీస్‌గఢ్‌లో 70 శాతం, హర్యానాలో 31 శాతం, మధ్యప్రదేశ్‌లో 53 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
- Tags
- 30 percent
- Crop
- Less
- rainfall
- weather
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!