Formers: తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిసిపోయాయి. సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Heavy rain: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం వరకు భగభగలతో అల్లాడిపోయిన భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి సూర్యని వేడితో అల్లాడుతున్న నగరవాసులకు చిరు జల్లులతో పలుకరించింది.
తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. నిన్న (ఆదివారం) రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఉదయం వరకు వర్షం కురిసింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం కాగా, పలు చోట్ల వర్షపు నీరు రోడ్లపైనే నిలిచింది.
Cyclone Mocha : ఇప్పటికే అకాల వర్షాలతో జనం అతలాకుతలం అవుతున్నారు. మళ్లీ పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆందోళన చెందుతున్నారు. మే 6వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలంగాణలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరి పంటలకు నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట రక్షణ కోసం పడ్డ కష్టమంతా గాలివాన, వడగండ్ల మూలంగా నేలపాలైందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Rains In Hyderabad: తెల్లవారుజామున వర్షం హైదరాబాద్ ప్రజలను పలకరించింది. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి గంటపాటు కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో నగరమంతా అస్తవ్యస్తంగా మారింది.
హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైయ్యాయి. ఉదయం 5 గంటల నుంచే వర్షం మొదలైంది. జంట నగరాలు భారీ వర్షానికి తడిచి ముద్దైంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పలు ప్రాంతాల్లో కురుస్తోంది.