Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండురోజులు వడగాల్పులు- ఐఎండీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Alert: మరో రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో 38-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయని.. ఎండలు కొద్ది కొద్దిగా తగ్గుతాయనీ ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
Read Also: Balayya : బాలయ్య తో శ్రీదేవి నటించకపోవడానికి కారణం అదేనా..?
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
దక్షిణ ఛత్తీస్ గఢ్ లో ద్రోణి ప్రభావంతో గత 24 గంటలుగా రాష్ట్రవ్యాప్తంగా నైరుతి, వాయవ్య గాలులు వీస్తున్నాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, హనుమకొండ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నందున వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో సాధారణ ఉష్ణోగ్రత 36-38 డిగ్రీలుగా ఉండాల్సిందని ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు. అదే విధంగా రాబోయే 24 గంటల్లో ఇదే విధమైన వాతావరణం వుండే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని, మధ్య భాగంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి.. 38-40 డిగ్రీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా జూన్ 15 లేదా 16 నుండి రుతుపవనాల వాతావరణం, ముఖ్యంగా తెలంగాణలోని దక్షిణ ప్రాంతాలలో ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లో మరో రెండు రోజుల పాటు 38-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు.
Read Also: Koppula Eshwar: అది ఎలా కుదురుతుంది.. జీవన్ రెడ్డికి కొప్పుల ఈశ్వర్ కౌంటర్
అటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, ఉరుములు-మెరుపులతో కూడిన ఈదురుగాలులు మరో 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆంధ్రాలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని దక్షిణ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
- Tags
- Alert
- IMD
- rains
- Telugu States
- weather
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!