కరెంటు తగిలితే షాక్ వస్తుంది.. కానీ, కరెంట్ బిల్లు చూస్తేనే షాక్ గురైన సంఘటన ఒకటి వెలుగు చూసింది.. ప్రతినెలా 500, 600 వచ్చే కరెంట్ బిల్లు.. 50వేల రూపాయలు బిల్లును చూసి ఓ ఇంటి యజమాని షాక్ కు గురయ్యాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని పేద కుటుంబానికి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంటి కరెంట్ బిల్లు 51,249 రూపాయలు వచ్చింది… తనకున్నది మూడు రూమ్‌లేనని, తాను నిరుపేద…
ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో.. నేడు రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏల నిరసన చేపట్టారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతపురం గ్రామానికి చెందిన యువకులు గ్రామ శివారులో దసరా సంబరాల్లో భాగంగా, మిత్రులంతా కలిసి మద్యం సేవిస్తుండగా ఉన్నట్టుండి వారిపై పిడుగు పడింది. దీంతో మందు పార్టీకి హాజరైన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
మిర్చి ధర కొత్త రికార్డు సృష్టించింది… వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డులు నెలకొల్పింది… దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 90 వేలు పలికింది… మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు కావడం విశేషం.. హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబత్ పల్లికి చెందిన అశోక్ అనే రైతు మార్కెట్‌కు మిర్చి తీసుకొచ్చారు.. రైతు తీసుకొచ్చిన మిర్చిని మాదవి ట్రేడర్స్ విక్రయించగా… క్వింటాల్‌కు రూ.90 వేలు వెచ్చించి కోనుగోలు చేసింది…
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక కాళోజీ నారాయణ రావు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇవాళ కాళోజీ 108వ జయంతి పురస్కరించుకుని హన్మకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణ రావు అని , నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కాళోజీ తన గళాన్ని వినిపించారని చెప్పారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని 25ఏళ్ల పాటు జైలు జీవితం గడిపి భరతమాత ముద్దుబిడ్డ కాళోజీ నారాయణ రావు అని, కాళోజీ…
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది.. రాత్రి భోజనం తిన్నప్పటి నుంచి విద్యార్థినిలకు వాంతలు మొదలయ్యాయి. వర్థన్న పేట ఆస్పత్రికి చికిత్స కోసం హుటాహుటిన తరలించారు. పాఠశాలలో మొత్తం మొత్తం 190 మంది విద్యార్థులు ఉండగా.. 60 మందికి విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు లోనవడంతో.. వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వారిలో 12 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో.. అక్కడి నుంచి ఎంజీఎం…
TRS MLA Aruri Ramesh said that the pud poisoning incident in Vardhannapet school is not a big issue: వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తిన్నప్పటి నుంచి విద్యార్థినిలకు వాంతలు మొదలయ్యాయి. కానీ, దానిని యాజమాన్యం సీరియస్ గా తీసుకోలేదు. అయితే వాంతులతో విద్యార్థినిలు తీవ్రంగా నీరసించి పోవడంతో.. యాజమాన్యం వర్థన్న…