నకిలీ రెవిన్యూ పత్రాలు, విద్యార్హత పత్రాలు రాజ్యమేలుతున్నాయి. కొంతమంది కేటుగాళ్లు వీటి తయారీతో లక్షలు, కోట్లు వెనకేస్తున్నారు. తాజాగా వరంగల్ లో మాజీ రెవిన్యూ ఉద్యోగి నకిలీల ఉదంతం వెలుగులోకి వచ్చింది. నకిలీ రెవెన్యూ పత్రాలను తయారు చేస్తున్న మాజీ వీఆర్.ఓతో సహా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు వరంగల్ జిల్లా పోలీసులు. వి.ఏ.ఓగా పదవీ విరమణ చేసిన రెవెన్యూ విభాగంలో పనిచేసిన అనుభవంతో సులువుగా డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కాడు.
Read Also: Meet Cute Review: మీట్ క్యూట్ (ఐదు కథల సమాహారం)
నకిలీ రెవెన్యూ పత్రాలను సృష్టిస్తున్న మాజీ వి.ఆర్.ఓ వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన మద్ది వెంకటరెడ్డి (70) తో పాటు కల్వచర్ల రఘు (50)ను టాస్క్ ఫోర్స్, నెక్కొండ పోలీసులు సంయుక్తంగా కలసి అరెస్ట్ చేసారు. వీరి నుండి పోలీసులు నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆర్టీఓకు సంబంధించిన నకిలీ ల్యాండ్ కన్వర్జేషన్ ప్రొసీడింగ్స్,130 సి ఫారాలు, తహసీల్దార్, ఆర్టీవో అధికారులకు సంబంధించిన నకిలీ ముద్రణలు, పహానీలు,కొటేషన్లు, బ్యాంకు చలాన్లు, గ్రామ నక్షాలు, స్టాంపు పేపర్లను పోలీసులు రిటైర్డ్ వి.ఏ.ఓ ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు. రిజిస్ట్రేషన్లు చేయించుకునే ముందు అన్నీ పక్కాగా వున్నాయా, నకిలీవి ఏమైనా వుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు.
Read Also: Meet Cute Review: మీట్ క్యూట్ (ఐదు కథల సమాహారం)