Power Bill: కరెంట్ బిల్లు చూస్తేనే షాక్.. వందల్లో వచ్చే బిల్లు.. వేలు దాటింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరెంటు తగిలితే షాక్ వస్తుంది.. కానీ, కరెంట్ బిల్లు చూస్తేనే షాక్ గురైన సంఘటన ఒకటి వెలుగు చూసింది.. ప్రతినెలా 500, 600 వచ్చే కరెంట్ బిల్లు.. 50వేల రూపాయలు బిల్లును చూసి ఓ ఇంటి యజమాని షాక్ కు గురయ్యాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని పేద కుటుంబానికి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంటి కరెంట్ బిల్లు 51,249 రూపాయలు వచ్చింది… తనకున్నది మూడు రూమ్‌లేనని, తాను నిరుపేద కుటుంబానికి చెందిన వాడని.. నాకు ఇంత కరెంట్ బిల్లు ఎలా వచ్చిందని ఆశ్చర్యానికి గురయ్యాడు… అయితే, గత మూడు నెలల క్రితం 32000 వేల రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని, విద్యుత్ అధికారులకు కంప్లైంట్ చేస్తే వారు మీటర్ రీడింగ్ లో పొరపాటు జరిగిందని, బిల్లును తీసుకొని వెళ్లి 5000 రూపాయాలు కడితే చాలు అని చెప్పి 5000 వేలు యజమానితో కట్టించుకున్నారని తెలిపారు..
Also Read
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
- Off The Record: ఒకే పార్టీకి రెండు ఆఫీసులా..? అక్కడ బీజేపీలో పీక్స్‌కు చేరిన గ్రూప్ వార్..!
అయితే, ఈ ఘటన జరిగి రెండు నెలలు గడిచిన అనంతరం మళ్లీ నిన్న విద్యుత్ అధికారులు ఇచ్చిన బ్రీడింగ్ బిల్లులో 4956 యూనిట్ల విద్యుత్ వినియోగించినట్టు.. దీనికి గాను 48,241తోపాటు మూడు వేల రూపాయల బకాయి కలిపి మొత్తం 51 వేల 249 రూపాయల కరెంట్ బిల్లు రావడంతో లక్ష్మయ్య కుటుంబం ఆందోళనకు గురైంది.. దీనిపై విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి సంప్రదిస్తే.. డీడీ కట్టి మీటర్ మార్చుకోవాలని చెప్తున్నారని, మరోసారి పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకుంటున్నారని లక్ష్మయ్య వాపోయాడు… అధికారులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు… ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు ఇంత కరెంట్ బిల్లు రావడం ఏంటని ఆశ్చర్యాన్ని గురవుతున్నారు.
తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!