Errabelli Dayakar Rao: ఆయన స్ఫూర్తితోనే రాజకీయంగా ఎదిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక కాళోజీ నారాయణ రావు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇవాళ కాళోజీ 108వ జయంతి పురస్కరించుకుని హన్మకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణ రావు అని , నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కాళోజీ తన గళాన్ని వినిపించారని చెప్పారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని 25ఏళ్ల పాటు జైలు జీవితం గడిపి భరతమాత ముద్దుబిడ్డ కాళోజీ నారాయణ రావు అని, కాళోజీ అందించిన స్పూర్తితోనే తాను రాజకీయంగా ఎదిగానని మంత్రి అన్నారు. కాళోజీ జన్మదినాన్ని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా గౌరవిస్తోందన్న మంత్రి దయాకర్ రావు, ప్రతి ఏటా ప్రముఖ కవులను గుర్తించి కాళోజీ అవార్డులతో గౌరవిస్తున్నామని, అలాగే వరంగల్ లో ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టామని ఆయన గుర్తు చేశారు. ఇక సీఎం కెసీఆర్ వరంగల్ లో ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీ కి కాళోజీ పేరు పెట్టారు. అయితే.. ప్రస్తుతం హన్మకొండలో కాళోజీ కళా క్షేత్ర నిర్మాణం చేపట్టామని, త్వరలోనే నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువులో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి 6.32 లక్షల ఉచిత చేప పిల్లలను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వదిలారు. అయితే.. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసి, అంతిమంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలోని చెరువులను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కాగా, వాటిల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడవుతారా?.. ఈ ప్రశ్నకు ఆయన ఏమన్నారంటే?
Also Read
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..