Home
Warangal
Warangal News
-
12 మంది మావోయిస్టు కీలక నేతలకు కరోనా.. చికిత్సకోసం వచ్చి చిక్కి..!
సిటీలు, పట్టణాలు, గ్రామాలు, గూడాలు, మారుమూల ప్రాంతాలనే కాదు.. అడవిలో ఉన్న అన్నల వరకు చేరింది కరోనా వైరస్… కోవిడ్ చికిత్స కోసం వచ్చి.. మావోయిస్టు పార్టీ డివిజినల్ కమిటీ కార్యదర్శి మరియు ఓ కొరియర్ పోలీసులకు చిక్కడంతో ఈ విషయం వెలుగుచూసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం మధ్యాహ్నం సమయంలో మట్వాడా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ములుగు నుండి వస్తున్న కారును తనీఖీ చేశారు.. కారు వెనుక భాగంలో… -
వరంగల్‌లో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠా అరెస్టు…
వరంగల్ లో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి మార్కెట్లో చెలామణి చేస్తున్న దంపతులను టాస్క్‌ఫోర్స్ మరియు ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. వారి నుండి సుమారు 10లక్షల 9వేల 960 రూపాయల నకిలీ కరెన్సీని సీజ్ చేశారు పోలీసులు.. వారి నుండి కరెన్సీని ముద్రించేందుకు వినియోగిస్తున్న కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు, ఒక కట్టర్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే… వరంగల్ కాశిబుగ్గ, తిలకోడ్ ప్రాంతానికి చెందిన వంగరి రమేష్,… -
వరంగల్ సెంట్రల్ జైల్ తరలింపుకు రంగం సిద్ధం
వరంగల్ సెంట్రల్ జైల్ తరలింపుకు రంగం సిద్ధమైంది. కేంద్ర కారాగారం స్థలాన్ని , వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. జైలు ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జైలు స్థలంలో ఎంజీఎంను తరలించి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది రానున్నారు. డీజీ సూచనలతో వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న 960 మంది… -
వరంగల్ లో రెండు ఆసుపత్రులకు కొవిడ్ చికిత్స అనుమతులు రద్దు
వరంగల్ నగరంలోని కొవిడ్ చికిత్స అందిస్తున్న హన్మకొండలోని మ్యాక్స్‌కేర్, వరంగల్ ములుగు రోడ్డులోని లలిత ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం రెండు హాస్పత్రుల్లో కొవిడ్ చికిత్స అనుమతులను రద్దు చేసింది. రెండు రోజుల కిందట అర్బన్‌లోని ఆరు ప్రైవేటు ఆసుపత్రులకు అధిక ఛార్జీల వసూలు, సౌకర్యాల లోపంపై వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి నేరుగా నోటీసులు జారీ చేసింది. అందులో పేర్కొన్న రెండు ఆసుపత్రులకు కొవిడ్ చికిత్స… -
వరంగల్ లో 11 హాస్పిటళ్లకు నోటీసులు…
వరంగల్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ దందాకు సామాన్యులు విలవిలాడుతున్నారు. అయితే కరోనా కష్టకాలంలో ప్రజల దగ్గర నుండి డబ్బులు దండుకుంటూ రోగులు, వారి బంధువులను ఇబ్బంది పెడుతున్న ప్రైవేట్ హాస్పిటళ్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వరంగల్ జిల్లాలో మొత్తం. 11 హాస్పిటల్స్ కి నోటీసు జారీ చేశారు. జిల్లా స్థాయిలో 5 హాస్పిటల్స్ కి రాష్ట్ర స్థాయి నుండి 6 హాస్పత్రులను నోటీసులు జారీ చేశారు. ఒక్కరోజుకు 30 వేల నుండి 50 వేలు చార్జీ… -
లాక్డౌన్ కేసీఆర్‌కు వరంలా మారింది.. అందుకే ఆస్పత్రుల పర్యటనలు !
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనపై నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ సమయం చూసుకొని.. సీఎం కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. “కరోనా రోగులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ గారు వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తే… అక్కడి ప్రజలు మాత్రం జనవరి 2015 నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళారు. నాడు ఈ నగరంలోని పలు మురికివాడల్లో పర్యటించిన సీఎం గారు వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, వాటిలో దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని… -
లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలి : సిఎం కెసిఆర్ ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు. మరికొద్ది రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనున్న నేపథ్యంలో రైతుల వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న పరిస్థితుల్లో.. ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని మరో వారం పది రోజుల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం… -
జిల్లాల్లో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన.. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.. ఆయా జిల్లాల్లో పరిస్థితి ఏంటి అనేదానిపై ఆరా తీశారు.. ఇక, తన పర్యటనలో ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీఎం.. కోవిడ్ రోగులతో మాట్లాడి.. వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు.. వారిలో భరోసా నింపుతూ ధైర్యాన్ని చెప్పారు..… -
వరంగల్ సెంట్రల్ జైలులో పర్యటించిన సిఎం కేసీఆర్
ఇవాళ సీఎం కేసీఆర్ వరంగల్ లో పర్యటించారు. నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెలిప్యాడ్ వద్ద మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ సీఎంకు స్వాగతం పలుకగా అనంతరం కేసీఆర్ నేరుగా ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడ ఉన్న కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులను పరామర్శించి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోకి కోవిడ్ వార్డులలో పర్యటించి రోగులకు భరోసా… -
ఇక వరంగల్‌కు కేసీఆర్.. ఎంజీఎం పరిశీలన..
కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. కోవిడ్ బాధితుల్లో ధైర్యాన్ని నింపడానికి పూనుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. బుధవారం రోజు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని పరిశీలించిన ఆయన.. కరోనా రోగుల్లో భరోసా నింపారు.. ఇక, క్లిష్ట సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను, జూనియర్ డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని అభినందించారు.. ఈ సందర్భంగా.. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఇప్పుడు వరంగల్ పర్యటనకు…
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!