Lightning Strike:దసరా పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. పండుగ పూట ఆనందంతో గడుపుతున్న స్నేహితులను విధి వక్రించింది. పండుగరోజు స్నేహితులతో కలిసి మందుపార్టీకి సిద్దమయ్యారు. గ్రామ శివారులో మద్యం సేవిస్తూ ఆనందంగా గడుపుతున్న స్నేహితులపై పిడుగు పడటంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు.
Read also: Eknath Shinde: నేను “కట్టప్ప”నే కావచ్చు.. కానీ మీలాగ మాత్రం కాదు.. ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతపురం గ్రామానికి చెందిన యువకులు గ్రామ శివారులో దసరా సంబరాల్లో భాగంగా, మద్యం పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. మిత్రులంతా కలిసి మద్యం సేవిస్తుండగా ఉన్నట్టుండి వారిపై పిడుగు పడింది. దీంతో మందు పార్టీకి హాజరైన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా వుండటంతో ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు బండవుతాపురంకి చెందిన బాలగాని హరికృష్ణ, వారి బంధువులు సాయి, కిట్టు గా గుర్తింపు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడంటో కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
Devaragattu Bunny Festival: బన్నీ ఉత్సవాల్లో విషాదం.. ఒకరు మృతి, 50 మందికి పైగా గాయాలపాలు