వరంగల్ జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి నిశ్చయమై.. తెల్లారితే నిశ్చితార్థం అనగా మృత్యువు ఊహించని విధంగా వర్షాల రూపంలో ఆ యువకున్ని మింగేసింది. ఈ ప్రమాదంలో యువకుడితో పాటు మరో వ్యక్తి మృతి చెందగా.. తల్లికి తీవ్రగాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా వరంగల్‌లోని మండి బజారులో ఓ పాత భవనం కూలడంతో..ఇద్దరు మృతి చెందారు. వరంగల్ నగరంలోని మండి బజార్ మెయిన్ రోడ్ లో గ్రాంపాస్ బేకరీ పురాతనమైన బిల్డింగ్ కూలి పక్కనే ఉన్న…
సీజన్ మొదలైన జూన్ 1వ తేదీ నుంచి జులై 12 వరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఏకంగా వంద శాతానికి పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లాలో 272.7 శాతం వర్షపాతం కురిసింది. ఇక భూపాలపల్లిలో 153, మహబూబాబాద్‌లో 147, జనగామలో 109, వరంగల్‌లో 95 , హనుమకొండలో 88 శాతం వర్షపాతం నమోదైనట్టు తేలింది. వరంగల్ నగరానికి వరద ముప్పు పొంచి ఉండటంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తగా ఎన్టీఆర్ఎఫ్ బలగాలు…
తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత నిర్వహిస్తున్నారు కాకతీయ ఉత్సవాలు. వారంపాటు జరిగే వేడుకలకు కాకతీయ రాజుల వారసులను ఆహ్వానించారు. నాటి కాకతీయ రాజుల చరిత్ర నేటి తరానికి చాటి చెప్పేలా ఏర్పాట్లు చేసినా.. వేడుకల్లో రాజకీయాలు చొచ్చుకొచ్చాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంబురాలను కేవలం ఇద్దరు ముగ్గురు నాయకులకే పరిమితం చేయడం ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్‌లో చర్చగా మారింది. వరంగల్‌లోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకే వేడుకల్ని పరిమితం చేశారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రాష్ట్రం మొత్తం…
ఆపరేషన్ వరంగల్. ఈ మధ్య కాలంలో ఓరుగల్లు రాజకీయాల్లో బలంగా చర్చల్లో ఉన్న మాట. ఉమ్మడి జిల్లాలో పట్టు కోల్పోకుండా టీఆర్ఎస్.. బలపడేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తులే పొలిటికల్ కలర్స్‌ను మార్చేస్తున్నాయి. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు.. ఎదుటి శిబిరంలో కాస్త ప్రజాదరణ ఉన్న నేతను.. తమవైపు లాగేందుకు చిత్ర విచిత్ర వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ నాయకుల్లో కొందరు 12…
నేడు కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభించేందుకు కాకతీయ 22వ యువరాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ ఓరుగుల్లు చేరుకున్నారు. అయితే.. ముందుగా ఆయన హనుమకొండలోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల నేపథ్యంలో.. మొట్టమొదటిసారి ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా కమల్‌చంద్ర భంజ్‌దేవ్ మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. కాకతీయ 22వ యువరాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ ను…
చారిత్రక వరంగల్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ వారోత్సవాలను నిర్వహించబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఓరుగల్లు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల ఘనకీర్తిని చాటేందుకు వరంగల్‌లో కాకతీయుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ‘కాకతీయ సప్తాహం’ పేరున ఈ నెల ఏడవ తేదీనుండి వారం రోజులపాటు అత్యంత ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ…
రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఘట్కేసర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసుల కాల్పుల్లో మరణించిన రాకేష్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వరంగల్ వెళ్తున్న సమయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. పోలీసులు రేవంత్ రెడ్డిని అడ్డుకోవడంపై కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. పోలీసులు తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. మరోవైపు తనను ఎందుకు అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి.. పోలీసులను ప్రశ్నించారు. పోలీసులకు రోజు…