Mirchi Price: కొత్త రికార్డు సృష్టించిన మిర్చి ధర.. క్వింటాల్ మిర్చి ధర 90 వేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిర్చి ధర కొత్త రికార్డు సృష్టించింది… వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డులు నెలకొల్పింది… దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 90 వేలు పలికింది… మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు కావడం విశేషం.. హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబత్ పల్లికి చెందిన అశోక్ అనే రైతు మార్కెట్‌కు మిర్చి తీసుకొచ్చారు.. రైతు తీసుకొచ్చిన మిర్చిని మాదవి ట్రేడర్స్ విక్రయించగా… క్వింటాల్‌కు రూ.90 వేలు వెచ్చించి కోనుగోలు చేసింది లక్ష్మీ సాయి ట్రేడర్స్… అశోక్ తీసుకొచ్చిన మిర్చిలో ఒక్క బస్తాకు మాత్రమే ఈ అత్యధిక ధర పలికింది. మిగతా బస్తాలకు సాధారణ రేట్లే వచ్చాయి.. మొత్తంగా.. మిర్చి ధర పైకికి ఎగబాకడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారుఉ.. ఇక, తన మిర్చికి మంచి ధర లభించడంపై రైతు అశోక్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు..
Read Also: Gold and Silver Price: పసిడి ప్రేమికులకు శుభవార్త..
Also Read
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
కాగా, జూలైలో వండర్ హాట్ రకం మిర్చి క్వింటాల్‌కు అత్యధికంగా రూ. 32,500కు అమ్ముడుపోగా.. సెప్టెంబర్ నెలలో అత్యధికంగా రూ. 35,500కు విక్రయించారు.. . ఇప్పుడు దేశీ మిర్చి 90 వేలకు చేరుకుని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అకాల వర్షాలతో పాటు తెగుళ్లతో ఇబ్బంది పడిన మిర్చి రైతులకు మార్కెట్ లో మంచి ధర లభిస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి వస్తుందో రాదో అనే భయంతో ఉన్న రైతులకు ఈ రికార్డు ధర కొత్త ఊరటనిస్తోంది. ఇన్ని రోజులుగా విక్రయించేందుకు ఎదురుచూస్తున్న మిర్చి రైతులు మార్కెట్‌కు క్యూ కడుతున్నారు..
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!