TPCC: రేవంత్ రెడ్డి సోమవారం హనుమకొండలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించారు. యాత్రలో హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్‌పైన దాడి జరిగింది.
Telangana Government: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 3 అధునాతన ఆస్పత్రుల నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చింది. 2 వేల కోట్ల రూపాయల విలువైన ఈ కాంట్రాక్టులకు సంబంధించి లెటర్ ఆఫ్ అవార్డును అందజేసింది. సనత్ నగర్, ఎల్‌బీ నగర్, ఆల్వాల్ ఏరియాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టేందుకు 3 నిర్మాణ సంస్థలను ఎంపిక చేసింది. ఈ ఆస్పత్రులను టిమ్స్ అనే పేరుతో పిలుస్తారు.
Jio : రిలయన్స్ జియో 5జీ నెట్‍వర్క్(Jio 5G Network) ఈ ఏడాది చివరి కల్లా దేశంలోని ప్రతీ పట్టణం, మండలం, గ్రామాల్లో జియో తన ట్రూ 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురానుంది.
సంక్రాంతి పండుగ సమయం దగ్గరపడింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈనెల రేషన్ బియ్యం పంపిణీలని ఇంకా మొదలు పెట్టలేదు. ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం పంపిణీకి బ్రేకు పడింది. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి రేషన్ డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుంది. అయితే.. ఈ నెల ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. కాగా.. కరోనా సమయంలో మాదిరిగా జనవరి నుంచి మరో ఏడాది పాటు కార్డులోని ప్రతి వ్యక్తికి అయిదు కిలోల చొప్పున ఉచిత…
ఖాకీ దుస్తులు ధరించి సమాజానికి సేవ చేయాలనే యువకుడి కల నెరవేరలేదు. ఆశయ సాధనలో ఓడిపోయానని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మూడు మార్కులు తక్కువ వచ్చినందుకు వరంగల్ జిల్లాకు చెందిన జక్కుల రాజ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మిర్చి ధర కొత్త రికార్డు సృష్టించింది. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డులు నెలకొల్పింది. వరంగల్ జిల్లాలో మిర్చి ధర బంగారం రేటు దాటి పోయింది. దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 80,100 వేలు పలికింది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ కొత్త మిర్చి చరిత్రలోనే హై రేట్ నమోదు చేసుకుంది.
హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం జరిగింది. కాజీపేటలో ప్రేమోన్మాది ఘూతుకానికి ఒడిగట్టాడు. పెళ్లికి ఒప్పుకోవడం లేదని, ప్రేయసి గొంగుకోశాడు దుర్మార్గుడు. ఆయువతి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నిన్న రాత్రి మండలంలోని కడిపికొండలో జరిగింది.