Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ ప్రచారంలో జోరు పెంచారు. ప్రచారంలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Vladimir Putin: ఉక్రెయిన్- రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో రష్యాపై దాడులను ఉక్రెయిన్ తీవ్రతరం చేసింది. కాగా, రష్యాపై దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు పలు దేశాలు సహాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటో దేశాలకు వ్లాదిమీర్ పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Vladimir Putin: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న (గురువారం) రష్యాలోని సెయింట్ పీటర్స్ వర్గ్‌లో వ్లాదిమీర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌తో దోవల్ షేక్ హ్యాండ్ ఇచ్చారు.
Ajit Doval: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. పుతిన్‌తో దోవల్ కరచాలనం చేసిన చిత్రాలను భారతదేశంలోని రష్యన్ రాయబార కార్యాలయం ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ఉక్రెయిన్‌లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ముగిసిన రెండు వారాల తర్వాత అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లారు.
Giorgia Meloni: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడంలో భారత్ పాత్ర పోషిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శనివారం అన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో భారత్, చైనా పాత్ర పోషించాలని కోరారు.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీవితం ఎప్పుడూ రహస్యమే. తాజాగా ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారని తాజాగా ఓ నివేదిక చెప్పింది. వీరిద్దరి జీవితం పూర్తిగా ఒంటరిగా, రహస్యంగా, ఐశ్వర్యంలో పెరిగారని చెప్పుకొచ్చింది.
Putin: అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసిసి) అరెస్ట్ వారెంట్‌ని ధిక్కరించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగోలియా పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐసీసీ గతేడాది పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఐసీసీలో సభ్యదేశాల పర్యటనకు వెళ్తే పుతిన్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెచ్న్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా మసీదును సందర్శించారు. మసీదులో బంగారంతో పొదిగిన ఖురాన్ కాపీని ముద్దుపెట్టుకున్నారు. అనంతరం ఇస్లాం పవిత్ర గ్రంథంతో ఫొటోలకు పోజులిచ్చారు. పర్యటనలో భాగంగా పుతిన్.. చెచ్న్యా నాయకుడు రంజాన్ కదిరోవ్తో సమావేశం అయ్యారు.
ఉక్రెయిన్ ఎదురుదాడికి రష్యా వణికిపోయింది. గత ఎనిమిది నెలల్లో పుతిన్ బలగాలు ఉక్రెయిన్‌లో స్వాధీనం చేసుకున్నంత రష్యా భూమిని చిన్న దాడితో ఎనిమిది రోజుల్లో ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ దాడితో ఆగ్రహానికి గురయ్యాడు. శత్రువులను తరిమికొట్టడానికి కుర్స్క్‌కు మరిన్ని దళాలను మోహరించాలని క్రెమ్లిన్‌కు పిలుపునిచ్చారు.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్-లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు కమ్ముకున్నాయి. ఇటీవల హమాస్ అగ్ర నేత హనియా హత్య తర్వాత ఈ పరిస్థితులు మరింత తీవ్రం అయ్యాయి.