Putin: పుతిన్‌కి ఇద్దరు రహస్య కుమారులు.. విలాసవంతమైన ఒంటరి జీవితం..
- పుతిన్‌కి ఇద్దరు రహస్య కుమారులు..
- అత్యంత గోప్యత.. భద్రత మధ్య పెంపకం..
- వీరి బాధ్యతల్ని చూస్తున్న పుతిన్ ప్రేయసి అలీనా కబేవా..
- తాజా నివేదికలో సంచలన విషయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీవితం ఎప్పుడూ రహస్యమే. తాజాగా ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారని తాజాగా ఓ నివేదిక చెప్పింది. వీరిద్దరి జీవితం పూర్తిగా ఒంటరిగా, రహస్యంగా, ఐశ్వర్యంలో పెరిగారని చెప్పుకొచ్చింది. పుతిన్ రహస్య కుమారుల పేర్లు ఇవార్, వ్లాదిమిర్ జూనియర్ అని, వారు విలాసవంతంగా, ఒంటరిగా జీవిస్తున్నారని బహిష్కరించబడిన రష్యా ప్రతిపక్ష నేత మికాయిల్ ఖోడోర్కోవ్‌స్కీ నేతృత్వంలోని పరిశోధన బృందం డోసియర్ సెంటర్ పేర్కొంది.
ఈ నివేదిక ప్రకారం.. వీరిద్దరిని రిటైర్డ్ జిమ్నాస్ట్, పుతిన్ ప్రేయసి అలీనా కబేవా పెంచుతున్నట్లు కథనం వెల్లడించింది. అలీనా కబేవాతో పుతిన్ చాలా ఏళ్లుగా సంబంధం కొనసాగిస్తున్నట్లు పుకార్లు ఉన్నాయి. ఇవాన్ పుతిన్ స్విట్జర్లాండ్లోని లుగానోవలోని ఒక ప్రైవేట్ క్లీనిక్‌లో 2015 జన్మించగా, వ్లాదిమిర్ జూనియర్ 2019లో మాస్కోలో జన్మించినట్లు నివేదిక వెల్లడించింది. వీరిద్దరు మాస్కోకు వాయువ్యంగా ఉన్న వాల్దాయ్‌లోని ఒక విలాసవంతమైన ఎస్టేట్‌లో నివసిస్తున్నట్లు చెప్పింది.
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
కట్టుదిట్టమైన భద్రత, గోప్యత:
విలాసవంతమైన ఎస్టేట్‌లో ఉంటున్న వీరికి ట్యూటార్, నానీలు, స్పోర్ట్స్ కోచ్‌లు ఉన్నట్లు చెప్పింది. ఈ ఇద్దరు అబ్బాయిలు పూర్తిగా ప్రజల దృష్టి నుంచి దూరంగా ఉన్నారు. వారు శీతాకాలంలో సోచిలోని స్కీయింగ్, వేసవిలో రష్యన్ జలాల్లో పడవల్లో గడుపుతారని నివేదిక పేర్కొంది. పిల్లలు ప్రైవేట్ జెట్‌లు, సాయుధ రైళ్లు, హెలికాప్టర్‌లు, పడవల వంటి వాటిలో ప్రయాణించేటప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని చెప్పింది. వీరి ట్యూటర్లకు ఏకంగా నెలకు 8540 డాలర్ల గణనీయ వేతనం చెల్లించబడుతుందని చెప్పింది.
డోసియర్ నివేదిక ప్రకారం.. పుతిన్ తన కుమార్తెల కన్నా ఇద్దరు కుమారుల పట్ల ప్రత్యేకమైన గౌరవప్రదమైన వైఖరిని కలిగి ఉన్నట్లు తెలిపింది. తన కుమారులపై అధికారం చేయగల ఏకైక వ్యక్తి పుతిన్ మాత్రమే అని, వారి ప్రతీ కోరికను తీర్చగలరని నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!