ఇది షహబాజ్‌ను పుతిన్ అవమానించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో కూడా ఆయన ఇలాగే అవమాన పడ్డారు.
Shahbaz Sharif: తుర్క్‌మెనిస్తాన్ వేదికగా జరుగున్న ఓ కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ జరగాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో పుతిన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో ఉన్నారు. సుమారు 40 నిమిషాలు వేచి చూసినా కూడా పుతిన్ పట్టించుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన షహబాజ్ షరీఫ్ దౌత్యంపరంగా సిగ్గులేని పని చేశాడు.
IndiGo chaos: 1000 పైగా విమానాలు రద్దు, డీజీసీఏ నిబంధనల్ని పాటించకుండా, ప్రభుత్వానికే సవాల్ విసిరేలా ‘‘ఇండిగో’’ ప్రవర్తించిన తీరును దేశం మొత్తం గమనిస్తోంది. లక్షలాది మంది ప్రయాణికుల అవస్థలకు కారణమైంది. డీజీసీఏ కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలకు అనుగుణంగా రోస్టర్ నిర్వహణ లోపం, మారిన నిబంధనలకు సిద్ధంగా లేకపోవడం వల్ల ఇండిగో గందరగోళం చెలరేగింది. దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైనర్, మార్కెట్‌లో మెజారిటీ షేర్ కలిగిన ఇండిగో కావాలనే ఇలా తన వ్యవస్థల్ని…
Shashi Tharoor: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను ఆహ్వానించారు. శనివారం ఈ విందుపై థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Modi's gifts to Putin: నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రధాని నరేంద్రమోడీ ఘనంగా స్వాగతించారు. భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా పుతిన్‌కు మోడీ పలు గిఫ్ట్‌లను ఇచ్చారు. బ్రహ్మపుత్ర సారవంతమైన నేతల్లో పండిన అస్సాం బ్లాక్ టీ, ముర్షిదాబాద్ సిల్వర్ టీ సెట్, చేతితో తయారు చేసిన వెండి గుర్రం, ఆగ్రా నుంచి పాలరాయి చెస్ సెట్, కాశ్మీరీ కుంకుమ పుప్పు, రష్యన్ భాషలో ఉన్న భగవద్గీతను…
Toyota Fortuner: నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. డిసెంబర్ 4న సాయంత్రం ఆయన ఢిల్లీలో ల్యాండ్ అవ్వడంతోనే భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా రిసీవ్ చేసుకునేందుకు వెళ్లారు. పుతిన్‌కు భారత్ తరుపున అపూర్వ స్వాగతం పలికారు. పాలం ఎయిర్‌పోర్టు నుంచి ఇరువురు నేతలు కలిసి ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. అయితే, మోడీ-పుతిన్ ఇద్దరూ తెల్లటి “టయోటా ఫార్చ్యూనర్” కారులో ప్రయాణించడం ఇప్పుడు అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. టయోటా ఫార్చ్యూనర్…
PM Modi: గత 8 ఏళ్లుగా ప్రపంచం అనేక అస్థిరతను చూసిందని, మానవత్వం సవాళ్లను చూసిందని, కానీ భారత్ రస్యా సంబంధాలు స్థిరంగా ఉన్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. భారత్, రష్యా సంయుక్త మీడియా సమావేశంలో మోడీ, పుతిన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.
PM Modi: రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్‌ను పట్టించుకోకుండా, స్వయంగా ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టుకు వెళ్లి పుతిన్‌ను ఘనంగా స్వాగతించారు. ప్రధాని మోడీ కొంత మంది విదేశీ అతిథుల కోసం మాత్రమే ఇలా ప్రోటోకాల్‌ను బ్రేక్ చేసి, స్వయంగా రిసీవ్ చేసుకున్నారు.
Putin’s Security: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే, పుతిన్ సెక్యూరిటీ భారత్‌లో ఉంది. మరోవైపు, పుతిన్ కోసం భారత్ 5 అంచెల విస్తృత భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. పుతిన్ వ్యక్తిగత భద్రతా విభాగం, ఆయనను కంటికి రెప్పలా అడుగడుగు కాపాడుతోంది. రష్యాలో అత్యంత రహస్య భద్రతా సంస్థల్లో ఒకటైన ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ (FSO) ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది.…
Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారతదేశంలో పర్యటించబోతున్నారు. రేపు సాయంత్రం ఆయన ఇండియాలో ల్యాండ్ కానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో, విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నేషనల్ సెక్యురిటీ గార్డ్ నునంచి అగ్రశ్రేణి కమాండోలు, స్నైపర్స్, డ్రోన్లు, జామార్లు, ఏఐ, ఇలా 5 అంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు.