Giorgia Meloni: ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ పరిష్కరించగలదు.. ఇటలీ ప్రధాని కామెంట్స్..
- భారత్ ఉక్రెయిన్ సంక్షోభ నివారణలో కీలక పాత్ర పోషించగలదు..
- ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వ్యాఖ్యలు..
- రెండు రోజుల క్రితం ఇవే కామెంట్స్ చేసిన పుతిన్..
- ఇటీవల రష్యా..ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Giorgia Meloni: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడంలో భారత్ పాత్ర పోషిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శనివారం అన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో భారత్, చైనా పాత్ర పోషించాలని కోరారు. ఉత్తర ఇటలీలోని సెర్నోబియో నగరంలోని అంబ్రోసెట్టి ఫోరమ్‌లో మెలోనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వేదికగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్‌స్కీతో ఆమె భేటీ అయ్యారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించడంలో భారత్ చేస్తున్న ప్రయత్నాలపై రష్యా అధినేత పుతిన్ వ్యాఖ్యానించిన రెండు రోజులు తర్వాత మెలోనీ నుంచి ఈ కామెంట్స్ వచ్చాయి.
గురువారం, వ్లాడివోస్టాక్‌లో జరిగిన 9వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో ప్రసంగిస్తూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఉక్రెయిన్ సమస్యని పరిష్కరించడంలో భారత్ సహాయ హస్తం అందిస్తోందని అన్నారు. ‘‘మేము మా స్నేహితులను, భాగస్వాములను గౌరవిస్తాము, వారు ఈ సంఘర్షణకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధితో ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఇది ప్రధానంగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, బ్రెజిల్, భారతదేశం. ఈ సమస్యపై మా సహోద్యోగులతో నేను నిరంతరం సంప్రదిస్తాను. ఈ దేశాల నాయకులు, వారితో మాకు నమ్మకమైన సంబంధం ఉందని, ఈ సంక్లిష్ట ప్రక్రియ యొక్క అన్ని వివరాలను అర్థం చేసుకోవడానికి హృదయపూర్వకంగా కృషి చేస్తారనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు’’ అని అన్నారు.
Also Read
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
- Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
Read Also: Kolkata Doctor Case: ఆర్‌జీ కర్ మాజీ-ప్రిన్సిపాల్‌కి సన్నిహితంగా ఉన్న ముగ్గురు డాక్టర్లపై వేటు..
ఇటు రష్యా, అటు ఉక్రెయిన్‌తో ఏకకాలం స్నేహం చేసే దేశంగా భారత్‌కి పేరుంది. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చర్చలు, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని పదేపదే భారత్ నొక్కి చెప్పింది. ఇదిలా ఉంటే, ప్రధాని మోడీ మూడోసారి వరసగా అధికారం చేపట్టిన తర్వాత రష్యా, ఆ తర్వాత ఉక్రెయిన్ పర్యటనకి వెళ్లారు. ఈ సందర్భంగా యుద్ధ నివారణకు భారత్ శాంతి చర్చల్లో తన మిత్రులకు అండగా నిలుస్తుందని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ వివాదం సమయంలో న్యూ ఢిల్లీ తటస్థంగా లేదా ఉదాసీనంగా ప్రేక్షకుడిని కాదని, ఎల్లప్పుడూ శాంతి పక్షాన ఉంటుందని కైవ్‌లో ఒకేరోజు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో అన్నారు. ఈ పర్యటన తర్వాత ప్రధాని మోడీ, పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడి తన పర్యటన వివరాలను పంచుకున్నారు. ప్రధాని మోడీ ప్రయత్నాలను వెస్ట్రన్ దేశాలతో పాటు అమెరికా అభినందించింది. ఈ సమస్యకు త్వరగా ముగింపు రావాలని ఆయా దేశాలు కాంక్షించాయి.
తాజావార్తలు
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
-
PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
-
Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
-
Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్‌ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!