Ajit Doval: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. పుతిన్‌తో దోవల్ కరచాలనం చేసిన చిత్రాలను భారతదేశంలోని రష్యన్ రాయబార కార్యాలయం ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ఉక్రెయిన్‌లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ముగిసిన రెండు వారాల తర్వాత అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లారు.
Read Also: Russia: రష్యన్ ఆర్మీలో చేరిన 45 మంది భారతీయులకు విముక్తి.. మరో 50 మందిని రక్షించే ప్రయత్నం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి నెలకొనేలా ‘పీస్ ప్లాన్’ కోసం దోవల్ రష్యా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోడీ తన ఉక్రెయిన్ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జెలన్‌స్కీతో చర్చలు జరిపారు. యుద్ధం ముగించడానికి రెండు దేశాలు కూడా కలిసి మాట్లాడుకోవాలని, దౌత్యం, చర్యలతో సమస్య పరిష్కరించుకోవాలని, శాంతి పునరుద్ధరణకు భారత్ క్రియాశీలక పాత్ర పోషించడానికి సద్ధంగా ఉందని చెప్పారు.
దోవల్ రష్యా పర్యటన శాంతి చర్చల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన భేటీలో ఈ శాంతి ప్రణాళికను పుతిన్ వద్దకు తీసుకెళ్లారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వార్షిక బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చే నెలలో రష్యాలోని కజాన్‌కి ప్రధాని మోడీ వస్తారనే ఆశాభావాన్ని పుతిన్ వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా అక్టోబర్ 22న ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని పుతిన్ ప్రతిపాదించారు. ‘‘ మేము మా మంచి స్నేహితుడు మోడీ కోసం ఎదురుచూస్తున్నాం. ఆయనకు శుభాకాంక్షలు’’ అని రష్యా మీడియా సమావేశంలో పుతిన్ చెప్పినట్లు రష్యన్ ఎంబసీ పేర్కొంది.
🇷🇺🤝🇮🇳 On September 12, #Russia's President Vladimir Putin had a meeting with Ajit Doval, National Security Advisor to the Prime Minister of #India, at the Konstantinovsky Palace in #StPetersburg.
👉🏻 https://t.co/vFQ64S4vMq#RussiaIndia #DruzhbaDosti pic.twitter.com/KxcD9aciDG
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) September 12, 2024