ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఇప్పటికే బాంబులతో ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతోంది. రష్యాకు ఫైటర్ జెట్‌లు ఉక్రెయిన్ భూతలంలోకి ప్రవేశించిన బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ పై సైనిక చర్య పేరుతో రష్యా యుద్ధానికి దిగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి అగ్రరాజ్యాల దేశాధినేతలు చెప్పినా పుతిన్ ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. ఈ నేపథ్యంలో భారత్ లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం…
ఉక్రెయిన్లో నెలకొన్న తాజా పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొద్దిరోజులుగా చోటు చేసుకుంటూ వస్తోన్న ఘర్షణ వైఖరి రోజురోజుకూ మరింత తీవ్రరూపాన్ని దాల్చుతోంది. సరిహద్దులకు పెద్దఎత్తున తన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని తరలించింది రష్యా. రెండు లక్షల మందికి పైగా సైన్యాన్ని చేరవేసింది. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి అగ్రరాజ్యం అమెరికా చేస్తోన్న ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించట్లేదు. ఈ నేపథ్యంలో కైవ్‌లోని తన రాయబార కార్యాలయాన్ని రష్యా ఖాళీ చేయడం ప్రారంభించింది. బుధవారం మధ్యాహ్నం నాటికి,…
ఉక్రెయిన్‌పై ఏ క్షణాన్నైనా యుద్దానికి దిగేందుకు రష్యా ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది . ఓవైపు అమెరికాతో చర్చలంటూనే, ఉక్రెయిన్‌లోని తిరుగుబాటుదారులతో దాడులు చేయిస్తోంది. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ దగ్గర అణుబాంబు ఉందని ఆరోపించారు. కొన్నిదేశాల ఆర్మీ సహకారంతో రష్యాపై దాడికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందన్నారు. చొరబాటుకు ప్రయత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను రష్యా దళాలు కాల్చి చంపినట్లు తెలిపింది రష్యా.. ఇక, రష్యా బలహీనపడాలని అమెరికా కోరుకుంటోందని మండిపడ్డారు. తమపై దాడి చేస్తే…