Putin Health Rumours: ఇటీవల అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, ఆరోగ్య మంత్రిత్వశాఖ మిఖాయిల్ ముర్కాష్కాతో కలిసి ఫ్లూ వ్యాక్సినేషన్‌లపై ఆవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. నేను సెంట్రల్ క్లినికల్ హస్పటల్ లో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నానని చెప్పుకొచ్చారు. అలాగే, దేశీయంగా ఉత్పిత్తి చేసిన మందులతో టీకాలు వేయాలని సిఫార్సు చేస్తున్నానని ఫ్లూ వ్యాక్సిన్‌ల గురించి రష్యా అధ్యక్షుడు తెలిపారు. దీంతో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. అయితే, ఈ వార్తలపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవా రియాక్ట్ అయ్యారు. ప్రెసిడెంట్ వ్లాదిమీర్ పుతిన్ సాధారణ వైద్య పరీక్షలు మాత్రమే చేయించుకున్నారు.. ఆయన ధృఢంగా, ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు.
Read Also: Annie master : జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యాను..
ఇక, ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్య పరిస్థితులపై ఎన్నో కథనాలు బయటకు వస్తున్నాయి. బాడీ డబుల్ ను సైతం ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. వీటిపై గతంలో పుతిన్ స్వయంగా రియాక్ట్ అయ్యారు. అలాగే, పుతిన్ అనారోగ్యంపై వస్తున్న వార్తలను క్రెమ్లిన్ ఎప్పటికప్పుడు ఖండిస్తునే ఉంది.