సీఎం వైఎస్ జగన్ ఎంత త్వరగా విశాఖ వెళ్లి కూర్చొంటే మాకు మరిన్ని సీట్లు పెరుగుతాయన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. ఇప్పటికే విశాఖలో అరాచకం.. భూకబ్జాలు పెరిగాయి.. సీఎం వెళ్తే మరింతగా పెరుగుతాయని.. విజయసాయి దెబ్బకు ఇప్పుడు విశాఖలో అందరూ భయపడుతున్నారు.. రేపు సీఎం వెళ్తే ఆయనకు భయపడతారని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.. 1200 గజాల భూమి ఉన్న ప్రతి విశాఖ వాసి గజగజలాడుతున్నాడన్న లోకేష్… పరిపాలనా కేంద్రీకరణ.. అభివృద్ధి వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి.. పరిపాలనా వికేంద్రీరణ అంటే పరిపాలనా విధ్వంసమే నని.. అభివృద్ది వికేంద్రీకరణ చేసింది మేమే అన్నారు.. టీడీపీ హయాంలో వచ్చిన 5.40 లక్షల ఉద్యోగాలు 13 జిల్లాల్లో వచ్చాయే తప్ప.. ఒక్క ఉద్యోగం కూడా అమరావతి ప్రాంతానికి రాలేదన్న ఆయన.. పరిపాలనా ఒకే చోట ఉంచి.. అన్ని జిల్లాల్లో అభివృద్జి చేయాలనేదే మా లక్ష్యంగా స్పష్టం చేశారు. మా లక్ష్యానికి అనుగుణంగా ఆటోమొబైల్ అనంతపురం, ఖనిజాలు, సోలార్ కంపెనీలు కర్నూలు, ఐటీ విశాఖ, ఎలక్ట్రానిక్స్ చిత్తూరు జిల్లాల్లోకి తెచ్చామని.. మేం తెచ్చిన వాటిని కంటిన్యూ చేసినా చాలా పరిశ్రమలు వచ్చుండేవి.. కానీ, వచ్చీ రావడంతోనే పీపీఏల రద్దు అంటూ ప్రకటించిన జగన్.. పెట్టుబడిదారుల్లో భయాందోళనలు పుట్టించారని.. పీపీఏల రద్దు కారణంగా సుజలాన్ అనే అతి పెద్ద కంపెనీ దివాళ తీసింది.. అందులో పెట్టుబడులు పెట్టిన చాలా పెద్ద పెద్ద కంపెనీలు దెబ్బతిన్నాయన్నారు.
Read Also: AP: సీఎస్‌కు ఐపీఎస్ అధికారి ఏబీవీ లేఖ.. ఆ అధికారం మీకు లేదు..!
ఇక, మేం చేసుకున్న ఒప్పందాలు కంటిన్యూ చేసి ఉంటే విశాఖలోనే అదానీ డేటా సెంటర్ ద్వారా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు, 70 వేల ఉద్యోగాలు వచ్చేవి.. విశాఖ రూపు రేఖలే మారేవన్నారు నారా లోకేష్.. ఏమీ చేయలేని తన చేతకానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకే సీఎం జగన్ మూడు రాజధానుల నినాదం ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు.. రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేని వాళ్లు మూడు రాజధానులు కడతారా..? అని ప్రశ్నించిన ఆయన.. ఇన్ని మాట్లాడుతోన్న జగన్.. అమరావతే రాజధాని అని నిర్ణయం జరిగిన రోజు.. విశాఖలోనో.. విజయవాడలోనో రాజధాని పెడదామని ఎందుకు చెప్పలేకపోయారు..? ఆ రోజు అమరావతికి మద్దతు పలికి.. ఇవాళ కాదనడం మోసం కాదా..? అంటూ నిలదీశారు. తమ శాఖ అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని.. ఏ పని కావడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.. అన్ని ఓ చోట ఉన్నప్పుడే పనులు కానప్పుడు.. మూడు వ్యవస్థలు మూడు చోట్ల ఉంటే పనులెలా అవుతాయని ప్రశ్నించారు. రాజధానుల వల్లే అభివృద్ధి జరుగుతుందంటే.. 175 నియోజకవర్గాల్లో 175 రాజధానులు పెట్టొచ్చుగా..? అంటూ సెటైర్లు వేసిన లోకేష్.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారితే ప్రజల పరిస్థితేంటీ..? అని మండిపడ్డారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి శ్రీలంక ఆర్ధిక పరిస్థితితో సమానంగా ఉందన్న ఆన.. పరిస్థితి ఇలాగే ఉంటే ఏపీలో ఏదో రోజు ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి వస్తుందని.. ఆర్ధిక ఎమర్జెన్సీ వస్తే బ్యాంకుల్లో ఉన్న ప్రజల డబ్బు, బంగారాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, నాణ్యత లేని మద్యం వల్ల 42 మంది ప్రాణాల పోయాయి.. అందుకే సభలో పోరాడామని తెలిపారు లోకేష్.. మా పోరాటం వల్లే సీఎం జగన్ నోరు విప్పారన్న ఆయన.. నాన్న బుడ్డి వల్లే అమ్మ ఒడి ఇవ్వగలుగుతున్నామని బహిరంగంగా చెప్పారని.. ఈ ప్రభుత్వం మద్యం మీదే మనుగడ సాగిస్తోందని సీఎంతోనే చెప్పించడం మేం సాధించిన విజయంగా చెప్పుకొచ్చారు.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేసే విషయంలో తదుపరి ప్రణాళిక సిద్దం చేసుకుంటామని వెల్లడించారు నారా లోకేష్.