ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్ను సందర్శించిన తరుణంలో.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయనపై హాట్ కామెంట్స్ చేశారు. మూడు సంవత్సరాల తర్వాత చంద్రబాబు వైజాగ్కి వచ్చారని, ఈ సందర్భంగా ‘అమరావతి అభివృద్ధిని చేస్తాం, విశాఖను రాజధాని చేస్తాం’ అని అమరావతి ప్రజలకు చంద్రబాబు చెప్పొచ్చు కదా అని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 14 సంవత్సరాల కాలంలో రాష్ట్రం కరువుతో ఉందని.. ఆయన రాజకీయాలు చేస్తూ, నారా లోకేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని…
విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో అల్లూరి విగ్రహానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… అల్లూరి 125వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏడాది పాటు వాడవాడలా ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ రోజు అల్లూరి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నామని అన్నారు. భీమవరంలో వచ్చే నెలలో జరిగే అల్లూరి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…
అమరావతిని రాజధానిగా చేస్తాం.. విశాఖను అభివృద్ధి చేస్తామంటూ గురువారం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు… ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకి అమరావతి మీదే ప్రేమ.. విశాఖకు పరిపాలన రాజధాని చంద్రబాబు వద్దంటే.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? అంటూ మండిపడ్డారు. విశాఖలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి.. మళ్లీ ఎన్నికలకు…
దక్షిణ అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు ముందు వర్షాలతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మారింది. విశాఖలో చల్లని, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు శ్రీశైలంలో భారీ వర్షం పడింది. అకాల వర్షంతో ప్రధాన వీధులన్నీ జలమయం అయ్యాయి. శ్రీశైలంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో భక్తులు…
సాగరతీరం విశాఖలో చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతోంది. ఆర్అండ్ అతిథి గృహం వద్ద స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి శిశు గృహ రక్షణలో ఉన్న ముగ్గురు చిన్నారులు అదృశ్యం అయ్యారు. ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు శిశు గృహ సంరక్షకులు. తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి రోడ్డుపై ఉన్న ముగ్గురు చిన్నారులను వారం రోజుల క్రితం గుర్తించిన చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు శిశు గృహంలో చేర్చారు. తల్లిదండ్రులు వచ్చేంత వరకు రక్షణగా…
అదో గ్రేట్ రాబరీ. తుపాకీతో బెదిరించి బ్యాంక్ దోచేశాడో దుండగుడు. పట్టపగలు… రెండంటే రెండే నిముషాల్లో… అంతా సినీ ఫక్కీలో జరిగింది. చోరీలో పోయిన సొత్తు కంటే రాబరీ యాక్షన్ ప్లాన్ పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. ఇది ముఠా పనా…!?. మారణాయుధాలతో తిరుగుతూ బ్యాంకులను టార్గెట్ ట్ చేస్తున్నాయా..!?. ఎన్నో అనుమానాలు. దీంతో కేసులో మిష్టరీని చేధించేందుకు స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి. శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయం..!!. అనకాపల్లి జిల్లా కాశింకోట మండలం నర్సింగబిల్లిలోని…
విశాఖ అంతర్జాతీయ విమానాశ్ర యం కోసం కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 800కోట్ల రూపాయల విలువైన ఈ భూములను తిరిగి స్వాధీనం చేయాలని ఏపీ సర్కారు రాసిన లేఖ కేంద్రం పరిశీలన లో ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న 74ఎకరాలను భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోవాలనేది ఆలోచన. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ సుమారు 375 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి రోజు పదుల సంఖ్యలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులు నడుస్తున్నాయి. ఏటి…
గృహ నిర్మాణానికి నిధుల కొరత లేదు.. సీఎం వైఎస్ జగన్ అందరికీ సొంతింటి కలను నెరవేరుస్తారని తెలిపారు మంత్రి జోగి రమేష్.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పేదలకు సొంతిల్లు కట్టించాలనే సంకల్పంతో 31 లక్షల మందికి ఇళ్లు ఇస్తున్నట్టు వెల్లడించారు.. అందులో భాగంగా మొదటి విడతలో 15.6 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు… సీఎం వైఎస్ జగన్ ఆలోచనా విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని.. గృహనిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. Read Also:…
విశాఖ టూర్ లో బిజీగా వున్నారు ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. డాబాగార్డెన్స్ లోని ప్రేమ సమాజంలో 90వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ప్రేమ సమాజం సావనీర్ ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి ప్రేమ సమాజంతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మానవ సేవ మాధవ సేవ..కష్టాలలో ఉన్నవారికి చేయూత నివ్వట౦ భారతదేశ స౦స్క్రతిలోనే అంతర్భాగంగా ఉందన్నారు. నేను చదువుకునే రోజులలో ప్రేమ సమాజం చేపట్టే కార్యక్రమాలలో పాల్గొన్నాను. కుల మత వర్గ బేధాలు…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కాబోయే భర్త పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా రావికమతంలో వరుడు పై వధువు చాకుతో దాడిచేసిన సంగతి తెలిసిందే. వరుడు రామునాయుడు పై తానే దాడి చేసినట్లు ఒప్పుకుంది వధువు పుష్ప. భక్తి మైకంలో ఉన్న పుష్ప ..తనకు పెళ్ళి వద్దంటు తను దేవుని భక్తురాలిగా ఉంటానంటూ పలు మార్లు తల్లిదండ్రులకు తెలిపింది. ఇప్పటికి రెండు పెళ్లి చూపులు కాన్సిల్ కావడంతో మూడవది ఒప్పించారు తల్లిదండ్రులు.…