సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ టీమ్ దావోస్ పర్యటనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న వేళ.. కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. ఓ కేసులో కోర్టులో హాజరుఅయ్యేందుకు విశాఖ వచ్చిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడు నెలలలో ఆరు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు..
విశాఖ నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ ఐఏఎస్లుగా అవతారం ఎత్తిన భార్య, భర్తల మోసాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. భర్త జీవీఎంసీ కమిషనర్గా, భార్య హెచ్ఆర్సీ జాయింట్ కలెక్టర్గా మోసాలకు పాల్పడ్డారు. వంగవేటి భాగ్య రేఖ అలియాస్ అమృత, మన్నెందొర చంద్రశేఖర్లు కలిసి టిడ్కొ ఇల్లులు, ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేశారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నకీలి ఐఏఎస్ జంట టిడ్కో ఇల్లు ఇప్పిస్తామని పలువురు దగ్గర లక్షలు…
విశాఖలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అందుకోసం 3 వింగ్స్ ఏర్పాటు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా బుకీలా వివరాలు కనుకుంటున్నారు పోలీసులు.
ఉత్తరాంధ్రలో నకిలీ ఐఏఎస్, ఐపీఎస్ల భాగోతాలు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి ఘటన మరువక ముందే.. మరో కిలాడి లేడీ తానో ట్రైని ఐఏఎస్ అధికారిని అంటూ హంగామా చేసింది. అంతేకాక తాను రాజకీయ నాయకుల బంధువునని కటింగ్లు కొట్టింది. నకిలీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆగడాలతో పోలీసు వర్గాలకు టెన్షన్ పట్టుకుంది. అమృత భాగ్య రేఖ అనే మహిళ తన భర్తతో…
విశాఖలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వుడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో భారీగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు చేశారు.
అనుకుంటాంగానీ..., రాజకీయాల్లోనే సెంటిమెంట్లు ఎక్కువగా పండుతుంటాయి. ఒక్కసారి నెగెటివిటీ డవలప్ అయితే చాలు... ఎంత ఉన్నత పదవి అయినా... తీసుకోవడానికి భయపడుతుంటారు నాయకులు. సరిగ్గా అటువంటిదే ఇప్పుడు వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోందట. ఆ సీటే అత్యంత కీలకమైన విశాఖ జిల్లా అధ్యక్షపదవి. ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో పార్టీ మీద అధ్యక్షుడిదే ఆజమాయిషీ. అధికారంలో వుంటే ఎమ్మెల్యేలతో సమానంగా... ఆ మాటకొస్తే... ఇంకాస్త ఎక్కువే గౌరవం లభిస్తుంది.
విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు... క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసామన్నారు పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి.. ఈ ముఠాతో పెద్ద తలకాయలకు సంబంధాలు ఉన్నాయని, వాళ్లను కచ్చితంగా పట్టుకుంటామన్నారు.. క్రికెట్ బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అయిన ఓ హెడ్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి ఎంక్వయిరీకి ఆదేశించామన్నారు..
ప్రైడ్ ఆఫ్ స్టీల్ అని గర్వంగా చెప్పుకునే విశాఖ ఉక్కు మనుగడ మీద ముసురుకున్న గాఢ మేఘాలు తొలిగిపోయాయి. ఎన్నికల హామీకి అనుగుణంగానే NDA ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ మనుగడను కాపాడే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. RINLకు 11500కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం అందించేందుకు కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో గత నాలుగేళ్ళుగా కార్మిక సంఘాలు సాగిస్తున్న పోరాటం.. రాజకీయ ఒత్తిళ్ళకు ఫలితం లభించినట్టైంది.
ఏపీలో ఎక్కడా లేని ఉత్సాహం విశాఖలో కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. విశాఖలో మోడీ రోడ్ షో అదిరిందన్నారు. ఎ
ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు మేము అండగా ఉంటామని ప్రధాని మోడీ అన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు.