Ramanaidu Studio Lands: విశాఖపట్నంలో వివాదాస్పదంగా మారిన రామా నాయుడు స్టూడియో భూములు స్వాధీనానికి రంగం సిద్దం అయింది. ప్రభుత్వ ఆదేశాలతో సురేష్ ప్రొడక్షన్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని వైజాగ్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ చెప్పారు. ఇక, షోకాజ్ నోటీసులకు వచ్చే రిప్లై ఆధారంగా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. మధురవాడ సర్వే నెంబర్ 336/పీతో పాటు మరి కొన్ని నంబర్లలో 34.44 ఎకరాలను స్టూడియో, చిత్ర నిర్మాణ అవసరాల కోసం సురేష్ ప్రొడక్షన్స్ కోసం ప్రభుత్వం కేటాయించింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా రామా నాయుడు స్టూడియోస్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది.