బట్లర్ వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అని హర్భజన్ సింగ్ అన్నాడు. కాగా బట్లర్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.. ఇప్పటి వరకు 4 మ్యాచ్ లు ఆడిన జోస్.. 204 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నాడు. బట్లర్ ను ఏమని ప్రశంసించాలో కూడా నాకు తెలియడం లేదని భజ్జీ అన్నాడు.
బిజీబిజీగా గడిపే టీమిండియా స్టార్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన గారాలపట్టి వామికాకు సమయం కేటాయించాడు. స్విమ్మింగ్ పూల్ లో తన చిన్నారి కూతురితో కలిసి సేద తీరుతున్న ఫోటోను కోహ్లీ మంగళవారం సోషల్ మీడియాతో కలిసి పంచుకున్నాడు.
రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో వార్నర్ 56 బంతులలో 65 రన్స్ స్కోర్ చేశాడు. అలా ఐపీఎల్ లో 6 వేల పరుగుల మైలు రాయిని అధిగమించాడు. ఇక వార్నర్ కంటే ముందు ఈ లిస్ట్ లో టీమ్ ఇండియాకు చెందిన విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ ఉన్నారు.
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఇప్పటికే ఒక చెరగని చెత్త రికార్డ్ ఉంది. కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయ్యి.. అత్యల్ప స్కోరుకి చాపచుట్టేసిన...