మూడు ఫార్మాట్లలోనూ తన అత్యుతమ ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. గతంలో మాదిరిగా కాకుండా కోహ్లీ ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నాడని.. అతడి మోహంపై నిత్యం నవ్వు కనిపిస్తుందని ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్నాడు.
ఆదివారం జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన ప్రదర్శనకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను గిఫ్ట్ గా అందుకున్నాడు. గ్రీవ్స్ ఎలక్ట్రీక మొబిలిటీ సీఈవో, డైరెక్టర్ సంజయ్ బెహ్ల్ కొత్త లిమిటెడ్-ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైమస్ ను కోహ్లీకి అందించారు.