Delhi Capitals Won The Match By 7 Wickets Against RCB: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఆర్సీబీ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్ల తేడాతో 16.4 ఓవర్లలో ఛేధించింది. ఫిల్ సాల్ట్ (45 బంతుల్లో 87) సృష్టించిన విధ్వంసం.. వార్నర్ (22), మార్ష్ (26), రుస్సో (35) ఆడిన మెరుపు ఇన్నింగ్స్ పుణ్యమా అని.. ఇంకా 20 బంతులు మిగులుండగానే ఆ భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఢిల్లీ జట్టు ఛేజ్ చేసింది. ఈసారి ఆర్సీబీ బౌలర్లు ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయారు. బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. దీంతో.. డీసీ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు.
Navdeep: ఆ హీరోయిన్ నా వల్ల ఆత్మహత్య చేసుకోలేదు.. నవదీప్ క్లారిటీ
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ మైదానంలో 200 పైగా భారీ స్కోరు చేసే ఆస్కారం ఉన్నప్పటికీ.. బ్యాటర్లు మొదట్లో నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించడం వల్ల ఆర్సీబీ స్కోరు నత్తనడకన సాగింది. డు ప్లెసిస్ (32 బంతుల్లో 45)డు కానీ, ఆ తర్వాత అతడు కూడా నెమ్మదించాడు. ఇక కోహ్లీ అయితే మరీ నిదానంగా ఆడాడు. 45 బంతులు ఆడిన అతడు కేవలం 5 ఫోర్లతో 55 పరుగులు చేశాడు. మహిపాల్ లామ్రోర్ (29 బంతుల్లో 54) మెరుపుదాడి చేయడంతో.. ఆర్సీబీ స్కోరు బోర్డు జోరందుకుంది. అతడు ఆడిన మెరుపు ఇన్నింగ్స్ కారణంగా.. ఆర్సీబీ స్కోరు 181/4కి చేరింది. ఇక 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 16.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది.
King Charles III : హైదరాబాద్ లో కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం వేడుకలు
డీసీ బ్యాటర్లు మైదానంలో అడుగుపెట్టిన మొదటి బంతి నుంచే విజృంభించడం మొదలుపెట్టారు. వార్నర్, ఫిల్ సాల్ట్ కలిసి కాసేపు ఆర్సీబీ బౌలర్లతో చెడుగుడు ఆడుకున్నారు. అనంతరం మార్ష్ కూడా క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించి వెళ్లిపోయాడు. ఫిల్ సాల్ట్ మాత్రం దాదాపు చివరిదాకా క్రీజులో నిలబడి.. విలయతాండవం చేశాడు. రేపన్నదే లేదన్నట్టుగా అతడు దండయాత్ర చేశాడు. 45 బంతుల్లోనే 87 పరుగులు చేశాడంటే.. ఎలా చెలరేగి ఆడాడో అర్థం చేసుకోవచ్చు. రిలీ రుస్సో సైతం దుమ్ముదులిపేశాడు. చివర్లో విన్నింగ్ (సిక్స్) షాట్ కొట్టి జట్టుని విజయతీరాలకు తీసుకెళ్లాడు.