ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఇవాళ రాత్రి 7: 30 గంటలకు.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఓ భారీ రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 12 పరుగులు చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా ఘనత సృష్టించనున్నాడు.
ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీపై బీసీసీఐ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీమింయాకి విరాట్ కోహ్లీ కీలకమైన బ్యాటర్. అతను ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తో పాటు వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ కీలకమైన ఆటగాడిగా ఉండబోతున్నాడు. ఇప్పటికే బీఐసీసీ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ కక్షకట్టి, విరాట్ కోహ్లీని టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పించాడని మాజీ చీఫ్ సెలక్షర్ చేతన్ శర్మ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మధ్య వివాదం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. గత మ్యాచ్లో గంభీర్ చర్యకు కోహ్లీ బదులిచ్చాడని విరాట్ అభిమానులు అంటుండగా.. సీనియర్స్ కు గౌరవం ఇవ్వడం లేదని గౌతీ ఫ్యాన్స్ కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు.
నవీన్ ఉల్ హాక్- విరాట్ కోహ్లీ తమ సోషల్ మీడియా అకౌంట్ ల్లో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కోహ్లీ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చాడు.. మనం వినే ప్రతీ విషయం ఎవరో ఒకరి అభిప్రాయం మాత్రమే.. అదే నిజం కాదు.. మనం చూసే ప్రతీది వాస్తవం కాదు.. మన దృక్కోణానికి సంబంధించింది అని మీనింగ్ వచ్చేలా ఓ కోటేషన్ ను కోహ్లీ పోస్ట్ చేశాడు. దీనికి కౌంటర్…
గంభీర్, కోహ్లీ మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. ఇక గొడవ అంతా సద్దుమణిగాక విరాట్ కోహ్లీ, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌండరీ లైన్ వద్ద నిల్చుని మాట్లాడుతున్నారు. దీంతో అటుగా వచ్చిన నవీన్ ఉల్-హక్ను కోహ్లీకి క్షమాపణ చెప్పమని రాహుల్ అడిగాడు. అయితే నవీన్ మాత్రం నేనేందుకు క్షమాపణ చెప్పాలి అన్నట్లుగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
మ్యాచ్లో మరో ఆసక్తికర ఘటన జరిగింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుండగా.. ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల కళ్లు గప్పి మైదానంలోకి వచ్చాడు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి మోకాళ్లపై కూర్చుని దండం పెట్టి, అనంతరం కాళ్లు మొక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
గంభీర్, కోహ్లీ మధ్య వాగ్వివాదం జరిగింది. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్తూ కొట్టుకొనేంత పనిచేశారు. వీరి మధ్య వాగ్వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇరుజట్ల సభ్యులు వారిని పక్కకు తీసుకెళ్లారు. దీంతో మ్యాచ్ అనంతరం మైదానంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో...